ETV Bharat / business

క్రెడిట్, డెబిట్​ కార్డ్స్​కు కొత్త రూల్స్.. అలా జరిగితే కస్టమర్​కు రోజుకు రూ.500! - ఆర్బీఐ న్యూస్​

Credit Debit Card New Rules: క్రెడిట్, డెబిట్​ కార్డుల జారీపై రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 2022 జులై 1 నుంచి అమలు కానున్న ఈ నిబంధనలతో సేవల్లో పారదర్శకత మెరుగవుతుందని ఆర్బీఐ తెలిపింది.

credit card new rules 2022
credit card new rules 2022
author img

By

Published : Apr 22, 2022, 2:46 PM IST

Credit Debit Card New Rules: క్రెడిట్​, డెబిట్​ కార్డుల మోసాలు, ఛార్జీల మోత నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా సిద్ధమైంది. కార్డుల జారీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని 2022 జులై 1 నుంచి అమలు చేయనుంది. ఈ నిబంధనలతో వినియోగదారులకు రక్షణతో పాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్​బీఐ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి...

  • క్రెడిట్​ కార్డు క్లోజ్ చేయాలని వినియోగదారుడు నుంచి విజ్ఞప్తి వస్తే దానిని వారం రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.
  • క్రెడిట్​ కార్డు క్లోజింగ్ విషయం వినియోగదారునికి వెంటనే ఈమెయిల్​, మెసేజ్​ ద్వారా సమాచారం అందించాలి.
  • సమస్యల పరిష్కారానికి ప్రత్యేకమైన మెయిల్​ ఐడీతో పాటు, ఐవీఆర్​ సేవలను ఉపయోగించాలి. వాటి వివరాలు ఇంటర్నెట్​ బ్యాంకింగ్​, వెబ్​సైట్​లలో ప్రత్యేకంగా కనిపించేలా చూడాలి.
  • క్రెడిట్ కార్డు మూసివేత ప్రక్రియలో విజ్ఞప్తుల స్వీకరణకు సరళీకృత విధానాన్ని అవలంబించాలి.
  • పోస్ట్ లేదా ఇతర మాధ్యమాల ద్వారానే విజ్ఞప్తి చేయాలని కఠిన నిబంధనలు విధించకూడదు.
  • క్రెడిట్​ కార్డు మూసివేయాలని విజ్ఞప్తి చేసిన వారం రోజుల్లోనే సమస్య పరిష్కరించాలి. లేకపోతే.. ఆలస్యం చేసిన ప్రతిరోజుకు రూ.500 చొప్పున కస్టమర్​కు బ్యాంకు జరిమానా చెల్లించాలి.
  • ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డును వినియోగించకుంటే.. కార్డు యజమానికి సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేసే ప్రక్రియను ప్రారంభించాలి.
  • 30 రోజుల వ్యవధిలోగా కార్డ్ యజమాని నుంచి ఎటువంటి సమాధానం రాకపోతే.. బకాయిల చెల్లింపునకు లోబడే ఖాతాను మూసివేయాలి.
  • 30 రోజుల వ్యవధిలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీతో కార్డ్ మూసివేత రికార్డును అప్‌డేట్ చేయాలి.
  • క్రెడిట్ కార్డ్ ఖాతా మూసివేసిన తర్వాత.. ఖాతాలో ఏదైనా క్రెడిట్ కార్డు నగదు ఉంటే దానిని యజమాని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలి.
  • క్రెడిట్​ కార్డు ఛార్జీలలో ఏవైనా మార్పులు ఉంటే వాటి అమలుకు 30 రోజుల ముందే వినియోగదారునికి తెలపాలి.
  • కార్డు యాక్టివేట్​ కాకముందే సిబిల్​, ఎక్సిపీరియన్ లాంటి క్రెడిట్​ బ్యూరోలకు ఇవ్వకూడదు.
  • క్రెడిట్​ కార్డు ద్వారా ఇచ్చే ఈఎంఐల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి.

డెబిట్​ కార్డుల విషయంలో కొత్త నిబంధనలు:

  • సేవింగ్స్​, కరెంట్​ ఖాతా ఉన్న ఖాతాదారులకు మాత్రమే డెబిట్ కార్డులు జారీ చేయాలి.
  • లోన్ అకౌంట్ ఖాతాదారులకు డెబిట్​ కార్డులు జారీ చేయకూడదు.
  • డెబిట్​ కార్డు తీసుకోవాల్సిందేనని ఖాతాదారుడిపై ఒత్తిడి చేయకూడదు. డెబిట్ కార్డ్ తీసుకుంటేనే ఇతర సదుపాయాలు ఉంటాయన్న షరతు పెట్టకూడదు.

ఇదీ చదవండి: ఖర్చుల లెక్క తెలిస్తే.. మదుపు చాలా ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.