ETV Bharat / business

మళ్లీ వడ్డీ రేట్ల పెంపు.. ఈఎంఐలు మరింత భారం - వడ్డీ రేట్లు పెంచిన ఆర్​బీఐ

RBI Interest Rate Hike : ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

RBI Interest Rate Hike
RBI Interest Rate Hike
author img

By

Published : Dec 7, 2022, 10:15 AM IST

RBI Interest Rate Hike : ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. అందరూ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు తెలిపింది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దీంతో ప్రస్తుతం వడ్డీ రేటు 5.90 నుంచి 6.25 శాతానికి పెరిగింది. సెప్టెంబర్​లో 5.40 శాతం ఉన్న వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతానికి చేసింది ఆర్​బీఐ.

ద్రవ్యోల్బణ నియంత్రణ కోసమే ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు, రుణ రికవరీపై ప్రభావం పడకుండా వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. భారత్‌లో 10 నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత 6 శాతానికి మించే కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మేలో 40 బేసిస్‌ పాయింట్లు, జూన్‌- ఆగస్టుల్లో మరో 50 బేసిస్‌ పాయింట్ల చొప్పున ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది.

పెరగనున్న ఈఎంఐల భారం..
కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ సవరించిన నేపథ్యంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సైతం వడ్డీ రేట్లను పెంచనున్నాయి. ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఈఎంఐ భారం కానుంది. ఇక ఇప్పటికే రుణం తీసుకున్న వారికి బ్యాంకులు ఈఎంఐలలో ఎలాంటి మార్పూ చేయనప్పటికీ ఈఎంఐలు కట్టాల్సిన నెలల సంఖ్య పెరుగుతుంది. ఆ లెక్కన సుదీర్ఘకాలం పాటు ఈఎంఐలు కట్టినప్పుడు ఆ విధంగా కట్టే వడ్డీ మొత్తం పెరుగుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.