ETV Bharat / business

'ఓలా' ఎలక్ట్రిక్​ స్కూటర్లపై భారీగా దీపావళి డిస్కౌంట్స్​- రూ.26,500 వరకు బెనిఫిట్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 12:48 PM IST

OLA Electric Scooter Diwali Discounts 2023 : ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. 'భారత్​ ఫెస్ట్​' సేల్​ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా దీపావళి సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా తమ ఎలక్ట్రిక్​ స్కూటర్లపై రూ.26,500 వరకు బెనిఫిట్స్​ అందిస్తోంది. ఏ మోడల్​ స్కూటీపై ఎంత డిస్కౌంట్​ లభిస్తుందో తెలుసుకుందాం.

OLA Electric Scooter Diwali Discounts 2023

OLA Electric Scooter Diwali Discounts 2023 : ప్రముఖ ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. 'భారత్​ ఫెస్ట్​' అనే పేరుతో సేల్​ను నిర్వహిస్తోంది. అందులో భాగంగా దీపావళి సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఓలా స్కూటర్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్​, బ్యాటరీ వారంటీ ప్రోగ్రాం, ఎక్స్​ఛేంజ్​ బోనస్​లు అందిస్తోంది. మొత్తంగా రూ.26,500 వరకు బెనిఫిట్స్​ లభించే అవకాశం ఉంది. ఓలా.. పండగ ఆఫర్లపై మరిన్ని వివరాలు మీకోసం.

బ్యాటరీ వారంటీ..
కొన్ని నెలల క్రితం ఓలా.. సెకండ్​ జెనరేషన్ ఎస్​1 సిరీస్​ స్కూటర్లను విడుదల చేసింది. ఇందులో కొన్ని కొత్త మోడళ్లతో పాటు వాటి రేంజ్​ను అప్​గ్రేడ్​ చేసింది. దీపావళి సందర్భంగా వాటిపై ఆఫర్లు ప్రకటించింది. అందులో భాగంగా.. ఓలా ఎస్​1 ప్రో (జెన్​-2) మోడల్​పై రూ.7,000 విలువగల బ్యాటరీ వారంటీని ఉచితంగా పొందొచ్చు. దీంతోపాటు ఎస్​1 ఎయిర్, ఎస్​1 X+ స్కూటర్ల బ్యాటరీ వారంటీపై 50 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఇప్పటికే ఎస్​1 ప్రో స్కూటర్​ను కొనుగోలు చేసిన వారు రూ.9,000 విలుగల కాంప్రెహెన్సివ్ ఎక్స్​టెండెడ్​ బ్యాటరీ వారంటీని.. కేవలం రూ.2,000తో అప్​గ్రేడ్​ చేసుకోవచ్చు.

ఓలా ఎస్​1 ప్రో (జెన్​-2)

ఓలా ఎక్స్​ఛేంజ్​ ఆఫర్స్..
ఐసీ ఇంజిన్​ స్కూటర్​​ ఎక్స్​ఛేంజ్​లపై కూడా ​ఓలా అదిరిపోయే బెనిఫిట్స్​ అందిస్తోంది. అందులో భాగంగా ఐసీ ఇంజిన్ స్కూటర్ ఎక్స్​ఛేంజ్​ చేసి.. ఓలా ఎస్​1 ప్రో కొనుగోలు చేస్తే.. రూ.10,000 వరకు బోనస్ అందిస్తోంది. ఇక ఎస్​1 ఎయిర్, ఎస్​1 X+ తీసుకున్న వారికి రూ.5,000 వరకు బోనస్ లభిస్తోంది.

వాయిదా పద్దతిలో వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి.. ఎంపిక చేసిన క్రెడిట్​ కార్డులపై రూ.7,500 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. దీంతోపాటు జీరో డౌన్ పేమెంట్, నోకాస్ట్​ ఈఎమ్​ఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు, అతి తక్కువ 5.99 శాతం ఇంట్రెస్ట్​ ​రేట్​ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్స్​ బెనిఫిట్స్ కూడా కంపెనీ​ అందిస్తోంది.

ఓలా ఎస్​1 ఎయిర్

టెస్ట్​ డ్రైవ్​ చేయండి.. స్కూటీ గెలవండి!
ఆసక్తి కలిగిన వారు ఏదైనా ఓలా స్టోర్​కు వెళ్లి.. వారి స్కూటర్లను టెస్ట్​ డ్రైవ్​ చేసేందుకు కంపెనీ అవకాశం కల్పిస్తోంది. ఇలా చేసిన వారిలో ప్రతిరోజు ఒకరిని ఎంపిక చేసి.. ఓలా ఎస్​1 X+ స్కూటీ, రూ.999 విలువగల మెర్చండైజ్​ వంటి వాటిని బహుమతులగా అందిస్తోంది. వీటితో పాటు గెలిచిన వారికి.. రూ.1,000 విలువగల ఓలా కేర్​+, ఓలా ఎస్​1 ప్రో స్కూటీపై డిస్కౌంట్స్​ కూపన్స్​ ఇస్తోంది.

ఓలా ఎస్​1 ఎక్స్​

ఓలా స్కూటీల ధరలు
ప్రస్తుతం ఓలా ఎస్​1 ప్రో ధర రూ.1,47,499గా (ఎక్స్​షోరూమ్​) ఉంది. వందకు పైగా నగరాల్లో ఈ స్కూటీలను డెలివరీ చేస్తున్నారు.

  • ఓలా ఎస్​1 ఎయిర్​ : రూ.1,19,999
  • ఓలా ఎస్​1 X+ : రూ.1,09,999
  • ఓలా ఎస్​1 X (3kWh) : రూ.99,999
  • ఓలా ఎస్​1 X (2kWh) : రూ.89,999

ఎలక్ట్రిక్​ కార్లు కొనాలనుకుంటున్నారా? టాప్​ 5 ఈవీ కార్లు ఇవే!

రూ.10 లక్షల్లోపు బెస్ట్​ కారు కావాలా? ఈ 3 బ్రాండ్స్ చెక్​ చేయండి - అదిరిపోయే​ ఫీచర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.