Gas Cylinder Price: వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. రూ.100 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1885కు, ముంబయిలో రూ.1884కు, హైదరాబాద్‌లో రూ.2099.5కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి.
అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరగా జులై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత నుంచి పెరగలేదు.
ఇవీ చదవండి: తగ్గిన 'కాఫీ డే' అప్పులు.. పూర్వ వైభవం తిరిగి వచ్చేనా!
ఇకపై దిల్లీ, కోల్కతా నుంచి హైదరాబాద్కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్