JIO Plans With OTT : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మరో రెండు నెలల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా వీటిని తమ యూజర్ల కోసం తీసుకువచ్చింది. ఏడాది కాలపరిమితితో వస్తున్న ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన Netflix, Disney+ Hotstar, ZEE5, SonyLIVలను కూడా యాక్సెస్ చేసుకొని మీకు నచ్చిన కంటెంట్‌ను వీక్షించవచ్చు.
JIO Annual Plan With Free Amazon Prime : రూ.3,227ల రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే.. రోజుకు 2 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు.. ఏడాది కాలపరిమితితో లభిస్తాయి. అంటే ఏడాది మొత్తానికి 730 జీబీని వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతో పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాలను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కాగా, ఈ ప్లాన్ అదనంగా అపరిమిత ట్రూ 5G డేటాను సైతం కలిగి ఉండటం విశేషం. అంటే 5G నెట్‌వర్క్ లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ప్లాన్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు (JIO Prime Video Yearly Plan).
ఈ ఆప్షన్స్ కూడా..
- JIO Plans With OTT : రూ.3,227 వార్షిక ప్లాన్‌లో.. మీరు ఒకవేళ అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే.. సోనీలివ్, జీ5 సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రూ.3,662 రీఛార్జ్‌తో SonyLiv, ZEE5 రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా చొప్పున ఏడాదిపాటు ఎంజాయ్ చేయవచ్చు. అదనంగా JioTV, JioCinema, JioCloudలను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
- రూ.3,226 ఇయర్లీ ప్లాన్‌తో రోజుకి 2GB డేటా, సోనీలివ్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. దీనికి అదనంగా JIOTV, JIOCinema, JIOCloudలను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
- రూ.3,225 వార్షిక ప్లాన్‌తో రోజుకి 2GB 5G డేటా, సోనీలివ్, జీ5 రెండూ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్స్‌ను ఆస్వాదించవచ్చు. వీటికి తోడు JIOTV, JIOCinema, JIOCloudలను కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
- రూ.3,178 యానువల్ ప్లాన్‌తో డిస్నీ+హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్లను పొందవచ్చు. ఇందులో రోజుకు 2GB డేటాను వాడుకోవచ్చు. అదనంగా JIOCinema, JIOTV, JIOCloudలను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ముందుగా మీ మొబైల్ నంబర్ సాయంతో Disney+ Hotstar యాప్‌లోకి సైన్ఇన్ అవ్వాల్సి ఉంటుంది.
గమనిక : ఈ అన్ని జియో ప్లాన్లలోనూ అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
ఓటీటీ లేని ప్లాన్..
JIO Plans Without OTT : 336 రోజుల వ్యాలిడిటీతో జియో మరో సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. కాగా, దీని ధర రూ.2,545గా ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటాను ఆస్వాదించవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉండవు. కానీ, జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను యాక్సెస్ చేయవచ్చు.
ఎయిర్టెల్ వార్షిక ప్లాన్స్..
Airtel One Year Plans :
- రూ.3,359 రీఛార్జ్‌తో రోజుకు 2.5GB అన్లిమిటెడ్ 5Gడేటా, అపరిమిత కాల్స్ బెనిఫిట్‌ను పొందవచ్చు. అదనంగా ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
- రూ.2,999 రీఛార్జ్‌తో రోజుకు 2GB అన్లిమిటెడ్ 5Gడేటా, అపరిమిత కాల్స్ బెనిఫిట్‌ను పొందవచ్చు. అదనంగా అపోలో 24/7, Hellotunes, Wynk మ్యూజిక్ల సేవలను ఆస్వాదించవచ్చు.
- రూ.1,799 రీఛార్జ్‌తో 24GB డేటా, అపరిమిత కాల్స్ బెనిఫిట్‌ను పొందవచ్చు. అదనంగా అపోలో 24/7, Hellotunes, Wynk మ్యూజిక్ల సేవలను ఆస్వాదించవచ్చు.
365 రోజుల వ్యాలిడిటీతో Vi ప్లాన్స్..
Vi One Year Plans :
- రూ.3,099 ప్లాన్ రీఛార్జ్‌తో రోజుకు 2GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు. దీంట్లో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. Vi movies and TV, Hotstar Subscriptionతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను కూడా పొందవచ్చు.
- రూ.2,999 ప్లాన్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు 850GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు. దీంట్లో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. Vi movies and TV బెనిఫిట్‌ను కూడా పొందవచ్చు.
- రూ.2,899 ప్లాన్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు రోజుకు 1.5GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు. దీంట్లో అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. Vi movies and TVతో పాటు ఇతర బెనిఫిట్స్‌ను కూడా పొందవచ్చు.
- రూ.1,799 ప్లాన్ రీఛార్జ్‌తో ఏడాదిపాటు 24GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు. దీంట్లో అపరిమిత కాల్స్, 3600(ఒక సంవత్సరానికి) SMS లభిస్తాయి. Vi movies and TV బెనిఫిట్‌ను కూడా పొందవచ్చు.
BSNL ఇయర్లీ ప్లాన్స్..
BSNL One Year Plans :
- రూ.3,299- నెలకి 2.5GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు.
- రూ.2,299 నెలకి 1.5GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు.
- రూ.1,251 నెలకి 0.75GB డేటాను ఎంజాయ్ చేయవచ్చు.