ETV Bharat / business

Reliance Jio Unveils JioSpaceFiber : జియోస్పేస్​ఫైబర్​తో​.. ఇకపై దేశంలో జెట్​ స్పీడ్​తో 5జీ​ సేవలు!

Reliance Jio Unveils JioSpaceFiber : రిలయన్స్ జియో తాజాగా జియోస్పేస్​ఫైబర్​ సేవలను ప్రారంభించింది. ఈ శాటిలైట్ నెట్​వర్క్​ ఆధారిత సర్వీస్​తో.. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం గిగాబిట్​ బ్రాడ్​​బ్యాండ్​ సర్వీసులను అందించడానికి రిలయన్స్ జియో సన్నాహాలు చేస్తోంది.

Reliance Jio Launches JioSpaceFiber
Reliance Jio Launches JioSpaceFiber
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 3:02 PM IST

Reliance Jio Unveils JioSpaceFiber : రిలయన్స్ జియో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో శుక్రవారం జియోస్పేస్‌ఫైబర్‌ (JioSpaceFiber) సర్వీస్​ను విజయవంతంగా ప్రదర్శించింది. భారతదేశంలో ఇప్పటికే తొలి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్‌ సర్వీస్‌ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రకటించింది. భారత్‌లో ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ సదుసాయం లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాండ్‌బ్యాండ్‌ సేవలను అందించనున్నట్లు తెలిపింది.

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్​!
రిలయన్స్​ జియో ఇప్పటికే భారత్‌లోని 45 కోట్ల మంది కస్టమర్లకు ఫిక్స్‌డ్‌ లైన్‌, వైర్‌లెస్‌ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవల ను అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్‌ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్‌, జియోఎయిర్‌ఫైబర్‌ లాంటి బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందిస్తోంది. తాజాగా వాటి సరసన జియోస్పేస్‌ఫైబర్​ను కూడా చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎలాంటి జాప్యం లేని, వేగవంతమైన ఇంటర్నెట్‌ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ సేవలను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నట్లు పేర్కొంది. తాజా శాటిలైట్‌ నెట్‌వర్క్‌తో జియో ట్రూ5జీ సేవలను సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందించనున్నట్లు రిలయన్స్ జియో స్పష్టం చేసింది.

శాటిలైట్ టెక్నాలజీ
లేటెస్ట్​ ‘మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌ (MEO)’ శాటిలైట్‌ టెక్నాలజీ కోసం.. ఎస్‌ఈఎస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. తద్వారా జియోకు ఎస్‌ఈఎస్‌కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్‌ శాటిలైట్ల నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ లభిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది.

దేశం నలుమూలా.. జియో సేవలు
జియోస్పేస్‌ఫైబర్‌ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే గుజరాత్‌ - గిర్‌, ఛత్తీస్‌గఢ్‌ - కోర్బా, ఒడిశా - నవరంగాపూర్‌, అసోం - ఓఎన్‌జీసీ జోర్హట్‌ లాంటి మారుమూల ప్రాంతాలను జియో బ్రాడ్​బ్యాండ్​ పరిధిలోకి చేర్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది.

‘‘భారత్‌లో లక్షలాది ఇళ్లకు, వ్యాపార సంస్థలకు జియో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ అనుసంధానతకు దూరంగా ఉన్న లక్షలాది మందికి కూడా జియోస్పేస్‌ఫైబర్‌ (JioSpaceFiber) ద్వారా సేవలను విస్తరిస్తున్నాం. జియోస్పేస్‌ఫైబర్‌తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా.. విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చు’’ అని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ (Akash Ambani) అన్నారు.

  • Reliance Jio launches JioSpaceFiber:

    Jio has demonstrated its new satellite broadband at the IMC 2023.

    JioSpaceFiber will deliver satellite broadband connectivity to consumers ar super affordable rates.

    In four remote locations of India, JioSpaceFiber has already launched:… pic.twitter.com/fyMxn8Qil2

    — Telecom TALK (@TelecomTalk) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Indian Mobile Congress 2023 : 7వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్​లో.. 100 5జీ ల్యాబ్స్​ ప్రారంభించిన మోదీ..

Reactions Against Infosys Narayana Murthy : గొడ్డులమా? లేదా ఉద్యోగులమా?.. వారానికి 70 గంటలు పనిచేయడానికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.