Jio Fiber Entertainment Bonanza : క్రేజీ ఆఫర్స్.. హై స్పీడ్ ఇంటర్నెట్.. గ్రామాల్లోనూ ఫుల్ నెట్‌వర్క్.. ఆకర్షించే రీఛార్జ్ ప్లానింగ్‌లతో జియో కస్టమర్ల మనసు దోచేస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ జియో ఫైబర్ హై స్పీడ్ బ్రాడ్‌బాండ్ సేవలను విస్తరించేందుకు రెడీ అవుతోంది. దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్‌బాండ్‌గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది. వేగవంతమైన విస్తరణలో భాగంగా జియో ఫైబర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాలను చేరుకుంది.
28 నగరాల్లో.. తెలంగాణలో 28 నగరాలు, పట్టణాలకు జియో ఫైబర్ తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ మాత్రమే గాకుండా ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్‌పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్‌లలో కస్టమర్లకు చేరువైంది. త్వరలో మరో 7 పట్టణాలకు తన సేవలను విస్తరించనుంది.
ఏపీలో 43 ప్రాంతాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో జియో ఫైబర్ 43 నగరాలు, పట్టణాల్లో పటిష్ఠ ఉనికితో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలు మాత్రమే గాకుండా, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులలో కూడా జియో ఫైబర్ లభ్యమవుతోంది.
జియోనే ఆదుకుంది.. లాక్‌డౌన్ సమయంలో.. తక్కువ డబ్బుతో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలందించి జియో ఫైబర్.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో తోడ్పడింది. ఆన్‌లైన్ తరగతులకే విద్యార్థులంతా పరిమితమైన సమయంలో.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నప్పుడు.. జియో వారికి చాలా సాయపడింది. చాలా మంది జియో ఫైబర్ సేవలనే వినియోగించుకున్నారు.
క్రేజీ ఆఫర్.. నూతన పోస్ట్ – పెయిడ్ ప్లాన్ యూజర్లకు జియో ఫైబర్ ఇప్పుడు ఎలాంటి ప్రవేశరుసుం లేకుండానే లభిస్తోంది. యూజర్లు గనుక జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్‌ను ఎంచుకుంటే, రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్ స్టాలేషన్ లను ఉచితంగానే పొందగలుగుతారు.
ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు.. మరో సంచలనాత్మక ఆఫర్ జియో ఫైబర్ ఎంటర్‌టైన్మెంట్ బొనాంజా. ఇది అదనంగా చెల్లించే రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభ ధరతో అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్‌కు యాక్సెస్ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా వారు 14 ప్రముఖ ఓటీటీ యాప్స్ కలెక్షన్ నుంచి తమకు నచ్చిన కంటెంట్‌ను చూడొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లు మొదలుకొని చిన్న, పెద్ద సంస్థలు, వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులతో సహా లక్షలాది మంది వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది జియో ఫైబర్. అపరిమిత వినోదం, వార్తలు, ఆరోగ్యం, చదువు లాంటివాటికి వేదికగా నిలుస్తోంది. ఇంకెందు లేట్.. జియో నెట్‌వర్క్‌కు మార్చేయండి మీ రూట్.