ETV Bharat / business

ఆదాయపు పన్ను తగ్గాలా? ఇవే మార్గాలు! - ఆదాయపు పన్ను ఆదా సెక్షన్​లు

మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఇప్పటికే చాలా మంది ఆదాయపు పన్ను మినహాయింపు పొందేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టే ఉంటారు. కేవలం పన్ను ఆదా చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయకూడదు. ఎంచుకున్న పథకాలు దీర్ఘకాలంలో ఆర్థిక భరోసా కల్పించేలా చూసుకోవాలి. అందుకు ఉపయోగపడే మూడు ముఖ్యమైన పథకాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-save-tax-in-india-and-ways-to-save-income-tax
భారత్​ ఆదాయపు పన్నును ఆదా చేసే మార్గాలు
author img

By

Published : Mar 24, 2023, 4:19 PM IST

పౌరులు సంపాదించే ఆదాయం పరిమితికి మించి ఉన్నప్పుడు.. అందుకు వర్తించే శ్లాబుల ఆధారంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం.. ప్రభుత్వానికి చెల్లించే పన్నులు తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలూ ఉన్నాయి. సెక్షన్‌ 80సీ.. ఓ ప్రత్యేకమైన దానిగా చెప్పుకోవాల్సింది ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్​ 1 నుంచి మార్చి 31 వరకు.. గరిష్ఠంగా రూ.1,50,000 వివిధ పథకాల్లో మదుపు చేయడం వల్ల పన్ను మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.

  1. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌)
  2. అయిదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు
  3. జీవిత బీమా పాలసీల ప్రీమియం,
  4. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)
  5. జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ)
  6. పెద్దల పొదుపు పథకం (ఎస్‌సీఎస్‌ఎస్‌)
  7. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్‌),
  8. గృహరుణం అసలు చెల్లింపు,
  9. ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ ఫీజు.. వంటివి ఈ సెక్షన్‌ కింద ఉంటాయి.

స్థిరమైన రాబడిని అందించే పథకాలు.. ద్రవ్యోల్బణ దృష్టితో చూసినప్పుడు పెద్దగా ఆదాయం అందించకపోవచ్చు. వీటి నుంచి వచ్చిన రాబడిపైనా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్‌ ఆధారిత పన్ను ఆదా పథకాలను ఎంచుకున్నప్పుడు నష్ట భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఈఎల్‌ఎస్‌ఎస్‌, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌), జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) వంటి వాటిలో దీర్ఘకాలంలో పెట్టుబడి పెడితే.. వృద్ధికి అవకాశం ఉంటుంది. వచ్చిన రాబడిపైనా పన్ను భారం ఎక్కువగా ఉండదు.

యులిప్‌లు తీసుకుంటే..
బీమా రక్షణ, స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు.. ఒకేచోట అందించే యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌) అంటారు. పెట్టుబడి, రక్షణ విడివిడిగా నిర్వహించలేని వారికి ఇవి అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఇవి పదిహేను నుంచి ఇరవై ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. వయసు, చెల్లించగలిగిన ప్రీమియం, వ్యవధి, వివిధ దశల్లో అవసరాలు, తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని, వీటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

1. మీరు చెల్లించే ప్రీమియానికి కనీసం పది రెట్ల వరకు బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. పదిహేను నుంచి ఇరవై రెట్లు ఉంటే మరీ మంచిది. మీరు ఎంచుకున్న కవరేజీ ఆధారంగా, ప్రీమియాన్ని మీ పెట్టుబడి నుంచి మినహాయిస్తారు.

2. వివిధ లక్ష్యాలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక యులిప్‌ ఎప్పుడూ మంచిదే. కాకపోతే పాలసీ వ్యవధి ముగిసే వరకు ప్రీమియం చెల్లించాలి. చాలా యులిప్‌లు ఈక్విటీ, డెట్‌ ఫండ్లను ఎంచుకునేందుకు దాదాపు ఐదు నుంచి తొమ్మిది ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మీ లక్ష్యాలకు అనుగుణంగా వీటిని ఎంచుకోవచ్చు. ఇందులో కొన్ని స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్లు, మరికొన్నింటిలో మల్టీ క్యాప్‌, థీమాటిక్‌ ఫండ్లూ అందుబాటులో ఉంటాయి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, ఫండ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫండ్‌ నుంచి మరో ఫండ్‌కు మారేందుకు కొన్ని నిబంధనలకు లోబడి.. 'స్విచ్ఛింగ్‌'కు అవకాశం ఉంటుంది.

3. కనీసం పది నుంచి పదిహేను ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే యులిప్‌లను తీసుకోవాలి. పెట్టుబడుల్లో డైవర్సిఫైడ్‌ ఫండ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. లక్ష్యం సమీపిస్తున్న సమయంలో ఈక్విటీ ఫండ్ల నుంచి పెట్టుబడిని డెట్‌ ఫండ్లలోకి మార్చుకోండి. 5 సంవత్సరాల అనంతరం పాక్షికంగా కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధ్యమైనంత వరకు ఈ వెసులుబాటును వాడుకోకపోవడమే మంచింది.

4. వ్యవధి తీరిన అనంతరం క్రమానుగతంగా పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించండి. దీంతో మరింత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగేందుకు వీలవుతుంది.

పింఛను పథకంతో..
పన్ను ఆదాతో పాటు, పదవీ విరమణ తర్వాత కూడా ఉపయోగపడాలి అనుకుంటే జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) మంచి ఎంపిక. ఈ ఎన్‌పీఎస్‌ పథకాన్ని అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ), పింఛన్‌ నిధి నియంత్రణ నియంత్రిస్తుంది. ఈ పథకంలో ముందుగా పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ అనంతరం పింఛను తీసుకునేందుకు వీలవుతుంది. ఎంత పింఛను వస్తుందనేది పెట్టిన పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా.. మార్కెట్‌ ఆధారిత పథకమే. కాబట్టి, రాబడికి కచ్చితమైన హామీ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే.. ఇతర పింఛను పథకాలతో పోల్చినప్పుడు ఎన్‌పీఎస్‌ ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.

  • పదవీ విరమణ వరకు జమ చేసిన మొత్తంలో నుంచి.. అరవై శాతం తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. మిగతా నలభై శాతంతో ఎంపిక చేసిన ఏడు సంస్థల నుంచి యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవే పింఛనును చెల్లిస్తాయి.
  • ఆటో ఛాయిస్‌, యాక్టివ్‌ ఛాయిస్‌ పేరుతో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. నష్టభయం, వయసు, భరించే సామర్థ్యాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. స్థిరాదాయం అందించే పథకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలు ఇందులో ప్రధానంగా ఉంటాయి.
  • ఇన్​కమ్​ టాక్స్​ యాక్ట్​.. సెక్షన్‌ 80 సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు ప్రత్యేకంగా మినహాయింపు పొందేందుకు వీలు ఉంటుంది.

తక్కువ లాకిన్‌తో..
పెట్టుబడిపై అధిక రాబడిని పొందుతూ.. పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) బాగా ఉపయోగపడతాయి. ఈ ఫండ్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఎనభై శాతం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన పథకాలుగా వీటిని చెప్పవచ్చు. పెట్టిన పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువ కాలం కొనసాగించినట్లయితే.. వీటి వల్ల వచ్చే ఈక్విటీ లాభాలు మెరుగ్గా ఉంటాయి. ఒక వ్యక్తి ముప్పై శాతం శ్లాబులో ఉండి, మొత్తం లక్ష యాభై వేల రూపాయలు ఇందులోనే మదుపు చేస్తే దాదాపు రూ.46,800 (పాత పన్నుల విధానం ప్రకారం) పన్నును ఆదా చేసుకోవచ్చు.

  • ఇందులో క్రమానుగత విధానంలో మదుపు చేసేందుకు, ఒకేసారి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. మార్కెట్‌ హెచ్చుతగ్గుల లాభాలను తీసుకోవాలంటే.. క్రమానుగత విధానంలో మదుపు చేయడమే మంచిది.
  • ఫండ్లను ఎంచుకునే సమయంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే విశ్లేషణను చూసుకోవాలి. ఫండ్‌ పెట్టుబడి లక్ష్యం, గత పనితీరు, ఫండ్‌ మేనేజర్‌, పోర్ట్‌ఫోలియో కూర్పు అనుభవంలాంటివి పరిగణనలోకి తీసుకోవాలి.
  • మూడేళ్ల వరకు పెట్టుబడిని కొనసాగించాలన్న నిబంధనతో మీరు మధ్యలోనే వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది.
  • ఇవీ చదవండి:
  • 'ఆ సంస్థలో భారీగా అక్రమాలు'.. హిండెన్‌బర్గ్‌ మరో సంచలన నివేదిక
  • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.