ETV Bharat / business

How To Get Rental Income Without Buying Property : ప్రాపర్టీ కొనకుండానే ప్రతినెలా అద్దె!.. అయితే ఇలా చేయండి.. - REITsతో ప్రతినెలా ఆదాయం పొందడం ఎలా

How To Get Rental Income Without Buying Property : ఇళ్లు, షాపులు వంటివి కొనుగోలు చేసి వాటిని అద్దెలకు ఇవ్వడం, మెయింటెనెన్స్​లు చూసుకోవడం కాస్త సవాలే. వాటికి పన్నులు కట్టడం, సమయానికి అద్దెలు వసూలు చేయడం వంటి పనులు ఉంటాయి. అలా కాకుండా ఆస్తులు కొనకుండానే నెలనెలా అద్దె పొందాలా? అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(REIT) ప్లాన్​ గురించి తెలుసుకోండి.

How To Get Rental Income Without Buying Property With REITs
How To Get Rental Income Without Buying Property
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 4:11 PM IST

How To Get Rental Income Without Buying Property : ప్రస్తుత రోజుల్లో ఒక వ్యక్తి కేవలం తను చేసే ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం పైనే కాకుండా వివిధ ఆదాయ వనరులపై కూడా ఆధారపడుతున్నాడు. ఇందుకోసం మార్కెట్​లో అందుబాటులో ఉన్న అనేక పెట్టుబడి మార్గాల్లో మదుపు చేస్తుంటారు. అయితే ఎన్ని రకాల ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్స్​ ఉన్నా సరే.. అవి కొన్నేళ్ల తర్వాత కాలం చెల్లుతాయి. అయితే వీటికి భిన్నంగా ఓ అద్భుతమైన మదుపు పద్ధతి అందుబాటులోకి ఉంది. దీని ద్వారా మీరు ఆస్తులు కొనకుండానే నెలనెలా ఓ నిర్దిష్టమైన అద్దె ఆదాయాన్ని పొందవచ్చు. అదే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(REIT) ప్లాన్​. తక్కువ రిస్క్​తో కూడుకున్న ఈ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

REIT అంటే ఏమిటి..?
What Is Real Estate Investment Trust : రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(REIT).. అనేది ఓ పెట్టుబడి మార్గం. ఇది మీ ఆదాయాన్ని పెంచే ఓ రియల్​ ఎస్టేట్​ సాధనం. దీని ద్వారా మీరు ప్రతినెలా ఓ కచ్చితమైన అద్దె ఆదాయాన్ని పొందవచ్చు. దీంతో మీరు సాధారణంగా ఉద్యోగం ద్వారా పొందే ఆదాయానికి అదనంగా సంపాదించుకోవచ్చు. REIT ప్రధాన ఉద్దేశం ఏంటంటే.. మదుపరులు నేరుగా ఆస్తులను కొనుగోలు చేయకుండానే వాటిపై పెద్దమొత్తంలో ఇన్వెస్ట్​ చేయించడం. తద్వారా తక్కువ రిస్క్​తో కూడిన నిరంతర ఆదాయాన్ని పొందడం.

తక్కువ రిస్క్​.. ఎక్కువ రాబడి..
REITs In India Returns : ఎక్కువగా రిస్క్ ​తీసుకోకుండా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి REIT పద్ధతి అనేది ఒక చక్కని ఇన్వెస్ట్​మెంట్​ ప్లాన్​గా సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే ఏదైనా REITలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు ఇందులో ఉన్న సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించడమే కాకుండా మార్కెట్​ నిపుణుల సూచనలు తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలను పొందగలరు. REITలో మదుపు చేసే సమయంలో వీటిని నిర్వహించే ఎక్స్​పర్ట్స్​తో మంచి సత్సంబంధాలను కలిగి ఉండాలి. అలాగే వీటికి సంబంధించి ట్రాక్​ రికార్డులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పెట్టుబడి వ్యూహం అనుసరించాలో అనే అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. వీటితో పాటు మీ సొంత పెట్టుబడి లక్ష్యాలను, రిస్క్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తంగా రియల్​ ఎస్టేట్​ రంగంలో REIT అనేది సొంతంగా ఆస్తులను కొనుగోలు చేసి వాటిని నిర్వహించే పనిలేకుండా, క్రమం తప్పకుండా అద్దె ఆదాయం రావాలనుకునే వారికి ఓ బెటర్ ఇన్వెస్ట్​మెంట్ ఆప్షన్​గా చెప్పవచ్చు.

ఆస్తులపై ఎవరికి హక్కులుంటాయి..?

  • REITలు పెట్టుబడిదారులను చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టేందుకు కూడా అనుమతిస్తాయి. అలాగే ట్రేడింగ్​ చేసుకునే అవకాశం కూడా ఈ పద్ధతిలో ఉంటుంది.
  • ఈ పెట్టుబడి పద్ధతిలో సదరు ప్రాపర్టీకి సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యతలను మార్కెట్​ నిపుణులు చూసుకుంటారు. అయినా సరే వాటిపై మీరు పూర్తి యాజమాన్య హక్కులను కలిగి ఉంటారు.

REIT ఎలా పని చేస్తుంది?
How Does REITs Work : REIT అనేది రియల్​ ఎస్టేట్​ ఆస్తుల సమూహం నుంచి ఓ కచ్చితమైన ఆదాయాన్ని సృష్టిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే వీటిని మ్యూచువల్​ ఫండ్స్​ లాగే నిర్వహిస్తారు. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్​.. పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి వాటిని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతుంది. ఇదే విధంగా REIT కూడా రిటైల్​, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి రియల్ ఎస్టేట్ ఆస్తులలో పెట్టుబడిగా పెడుతుంది. సాధారణంగా ఈ REITల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తులైన కార్యాలయ స్థలాలు, వ్యాపార పార్కులు, షాపింగ్ మాల్స్ వంటివి ఉంటాయి. వీటి ద్వారానే మీరు క్రమం తప్పకుండా నెలనెలా అద్దె ఆదాయాన్ని పొందుతారు. వాస్తవానికి మనం బయటకు వెళ్లి నేరుగా ఆస్తులను కొనుగోలు చేయకుండా, REITలకు చెందిన స్టాక్‌హోల్డర్లే మన తరఫున రియల్ ఎస్టేట్​ ప్రాపర్టీస్​లో పెట్టుబడి పెడతారు. తద్వారా వాటిపై వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని మనకి అందిస్తారు. కాగా, కంపెనీ ఆర్జించే అద్దె ఆదాయం నుంచి REITల్లో ఇన్వెస్ట్​ చేసిన పెట్టుబడిదారులకు డివిడెండ్ల రూపంలో తమ రెగ్యులర్​ ఇన్​కమ్​ అందుతుంది.

భారతదేశంలో REITల రకాలు(Types of REITs In India) :
ఈక్విటీలు : ఇందులో అద్దె ద్వారా ఆదాయాన్ని పెంచే అన్ని ఆస్తులను REIT కలిగి ఉంటుంది. వివిధ కార్పొరేషన్లు లేదా వ్యక్తులకు ఆస్తులను లీజుకు ఇచ్చినవారికి కూడా వీటిపై యాజమాన్య హక్కులు ఉంటాయి. వీటి ద్వారా వచ్చే అద్దె ఆదాయం పెట్టుబడిదారులకు పంపిణీ చేస్తారు. ఇలా తనఖా, హైబ్రిడ్, పబ్లిక్‌గా ట్రేడెడ్​ వంటి REITల ద్వారా కూడా అధిక ఆదాయాన్ని అర్జించవచ్చు.

వచ్చే ఏడాది చివరినాటికి..
REITs In India : భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం నుంచి REITలను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉండేది. దీంతో కొన్ని సంవత్సరాల క్రితమే వీటిని మన దేశంలోనూ ప్రవేశపెట్టారు. ఒక నివేదిక ప్రకారం.. స్టాక్ మార్కెట్ల పనితీరు ఆధారంగా ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి వచ్చే ఏడాది చివరి వరకు లేదా 2025 ప్రారంభంలో కనీసం నాలుగు REITలు లిస్టింగ్​ అయ్యే అవకాశం ఉంది. ఇందులో Embassy Office Parks REIT(2019), Mindspace Business Parks REIT, Brookfield India REITలతో పాటు ఇటీవలే లిస్టింగ్​ అయిన Nexus Select Trust కూడా ఉంది. కాగా, Nexus Select Trust అనేది భారతదేశపు మొదటి REIT.

సెబీ పర్యవేక్షణలో..
REITను ఒక కార్పొరేషన్, ట్రస్ట్ లేదా అసోసియేషన్​గా భావించవచ్చు. ఇది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలు లేదా తనఖాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండడమే కాకుండా వాటిని నిర్వహిస్తుంది. REITలను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)లో నమోదు చేశారు. ఇండియన్ ట్రస్ట్స్ యాక్ట్, 1982 ప్రకారం REITని ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేశారు.

Bank Holidays in November 2023 : అలర్ట్.. బ్యాంకులకు 12 రోజులు సెలవులు.. బడ్జెట్ ప్లాన్​ చేసుకోండి!

Gold Rate Today 12th October 2023 : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.