ETV Bharat / business

How to get Refund for Wrong UPI Transaction : మీరు UPI ద్వారా తప్పుడు అకౌంట్​కి మనీ పంపారా?.. అయితే రిఫండ్ పొందండిలా.! - తప్పుడు అకౌంట్​కి పంపిన డబ్బులు పొందండిలా

How to get Refund for Wrong UPI Transaction : మీరు తరచుగా UPI యాప్స్ ద్వారా ఇతరులకు డబ్బులు పంపుతున్నారా? ఎప్పుడైనా పొరపాటున పంపించాలనుకున్న ఖాతాకు కాకుండా.. వేరే అకౌంట్​కు మనీ ట్రాన్స్​ఫర్ చేశారా? అయితే ఇది మీకోసమే. అలాంటి సందర్భాల్లో ఆ డబ్బును వెనక్కితీసుకోవడం ఎలాగో.. మీకు తెలుసా??

UPI Transactions
UPI Transaction
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2023, 4:06 PM IST

How to get Refund for Wrong UPI Transaction : ప్రస్తుతం భారత్ డిజిటల్ బాటలో వేగంగా అడుగులు వేస్తోంది. రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుండడంతో బ్యాంకింగ్ రంగం శరవేగంగా దూసుకెళ్తోంది. అలాగే కొవిడ్ పుణ్యమా అని.. ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్(UPI Payments) ఎక్కువైపోయాయి. దాంతో జనాలు చాలా వరకు బ్యాంకుకు వెళ్లకుండానే ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకుంటున్నారు.

Best Ways for Get Wrong UPI Transaction Refund : ఇక UPI యాప్స్ విషయానికొస్తే.. కేవలం చేతిలో స్మార్ట్​ఫోన్ ఉంటే చాలు ఉన్నచోట క్షణాల్లో చెల్లింపులు చేసేస్తున్నాం. అవతలి వ్యక్తి యూపీఐ ఐడీ, ఫోన్‌ నంబర్‌, క్యూర్‌ కోడ్‌ స్కాన్‌.. ఇలా ఏది ఉన్నా సులభంగా డబ్బు పంపించే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కానీ, కొన్నిసార్లు మనం యూపీఐ ఐడీ/ఫోన్‌ నంబరు వంటివి ఎంటర్‌ చేసే క్రమంలో పారపాట్లు జరిగి మనం పంపే డబ్బు వేరే యూపీఐ అకౌంట్​కి(Wrong UPI Transactions) వెళుతుంది. ఇకపై అలాంటి సందర్భాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్​గా మనం పంపిన డబ్బును రిఫండ్ రూపంలో పొందవచ్చు. మరి, అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

How to Retrieve Wrong UPI Transaction Money : మీరు తప్పు ఖాతాకు UPI చెల్లింపు చేసి ఉంటే వెంటనే మీ ఫోన్‌లోని తక్షణ హెచ్చరిక నుంచి టెక్స్ట్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు టెక్స్ట్‌ని అందుకోనట్లయితే మీరు ఆ UPI యాప్ ద్వారా లావాదేవీలు జరిపారో దాని ద్వారా కూడా లావాదేవీని నివేదించవచ్చు. అయితే Paytm, BHIM, Google Pay, PhonePe వంటి UPI యాప్​లలో ఏ విధంగా రిపోర్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Paytm UPI ద్వారా రిపోర్ట్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

How to Report for Wrong UPI Transaction on Paytm : మీరు Paytm ద్వారా తప్పు వ్యక్తికి డబ్బులు పంపినట్లయితే.. మీరు నేరుగా ఆ వ్యక్తిని సంప్రదించి మీ మనీ తిరిగి ఇవ్వమని అడగాలి. ఒకవేళ మీరు ఆయనను చేరుకోలేకపోతే నేరుగా సమన్వయం కోసం అతని వివరాలను పొందడానికి మీరు రిసీవర్ బ్యాంక్‌ని సంప్రదించవచ్చు. అలాగే మీరు రిసీవర్‌తో మాట్లాడలేకపోతే క్రింద పేర్కొన విధంగా 24×7 సహాయ విభాగం ద్వారా Paytmని సంప్రదించండి.

  • మొదట మీ ఫోన్​లో పేటీఎం ఓపెన్​ చేసి.. ఎగువ ఎడమవైపున ఉన్న ప్రొఫైల్ పిక్చర్ మెనుపై నొక్కాలి.
  • ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి.. 24×7 Help and Support అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • అనంతరం మళ్లీ స్క్రోల్ డౌన్ చేసి View All Servicesపై క్లిక్ చేయాలి. UPI Payment & Money Transfer అనే విభాగానికి వెళ్లాలి.
  • అక్కడ మీరు ఫిర్యాదును నివేదించాలనుకుంటున్న wrong transactionను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీరు ఫిర్యాదు చేయడానికి, రిఫండ్ ప్రక్రియను ప్రారంభించడానికి Paytm అసిస్టెంట్‌తో చాట్‌ని ప్రారంభించాలి. జరిగిన విషయం చెప్పాలి.
  • అప్పుడు Paytm బృందం రిసీవర్​ని సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. సమ్మతి పొందిన తర్వాత మీరు తప్పుడు యూపీఐ ద్వారా పంపిన మొత్తాన్ని రిఫండ్ చేస్తుంది.

How to Use UPI Lite : మీరు 'యూపీఐ పిన్' ఎంటర్ చేయకుండానే.. డబ్బులు చెల్లించవచ్చు.!

How to Report for Refund Wrong UPI Transaction on BHIM UPI :

BHIM UPI ద్వారా తప్పుడు ట్రాన్సక్షన్​కి ఎలా రిఫండ్ పొందాలో చూద్దాం..

  • మొదట మీరు BHIM యాప్ ఓపెన్ చేసి.. ఎగువ కుడివైపు ఉన్న Hamburger Menu (మూడు లైన్లు)పై నొక్కాలి.
  • ఆ తర్వాత Raise Complaint అనే ఆప్షన్​కి వెళ్లాలి.
  • అప్పుడు మీరు ఫిర్యాదును చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వివరాలను పూరించడానికి Raise a Concernపై నొక్కాలి లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయడానికి మీరు కాల్ బ్యాంక్‌పై నొక్కాలి.

How to Report for Refund Wrong UPI Transaction on Google Pay

Google Pay UPI ద్వారా రిఫండ్ పొందడానికి రిపోర్ట్ చేయండిలా..

  • మీ ఫోన్‌లో ముందుగా Google Payని ఓపన్ చేయాలి.
  • ఆ తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి Show all transaction historyపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీరు ఫిర్యాదును నివేదించాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత దిగువన ఉన్న Having issues బటన్‌పై నొక్కాలి. (ఇది లావాదేవీ తేదీ నుంచి రెండు రోజుల తర్వాత చూపబడుతుంది).

Reasons For UPI Transaction Failure : పేమెంట్ చేస్తుంటే ట్రాన్సాక్షన్​ మధ్యలో ఆగిందా? ఇదిగో సొల్యూషన్!

How to Report for Refund Wrong UPI Transaction on PhonePe :

PhonePe UPI ద్వారా రిఫండ్ పొందడానికి రిపోర్ట్ చేయండిలా..

  • ముందుగా మీ ఫోన్‌లో PhonePe యాప్‌ను ప్రారంభించాలి.
  • ఆ తర్వాత క్రింద ఉన్న History అనే బటన్‌పై నొక్కాలి.
  • ఆపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్న లావాదేవీని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఫిర్యాదు చేయడానికి, వాపసు ప్రక్రియను ప్రారంభించడానికి PhonePe సహాయ మద్దతుతో చాట్‌ని ప్రారంభించడానికి Contact PhonePe supportని సంప్రదించాలి.

ఇలా మీరు ఏ యూపీఐ యాప్ ద్వారా తప్పుడు ఖాతాకి డబ్బుకి పంపారో దానిని ఎంచుకుని పైన పేర్కొన్న విధంగా రిపోర్ట్ చేసి మీరు పంపిన మనీ తిరిగి రిఫండ్ రూపంలో పొందవచ్చు. చివరగా.. పొరపాటున డబ్బు బదిలీ చేసినప్పటికీ, డబ్బు తిరిగి ఇచ్చేందుకు ఒక్కోసారి కస్టమర్‌ అంగీకరించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఎవరైనా యూపీఐ లావాదేవీలు నిర్వహించేముందు ఫోన్‌ నంబర్‌, యూపీఐ ఐడీ వంటి వాటిని రెండు, మూడు సార్లు చెక్‌ చేసుకోవడం మంచిది.

UPI Payments Without Active Internet : జస్ట్ ఓ కాల్​తో..​ ఇంటర్నెట్​ లేకున్నా సులువుగా యూపీఐ పేమెంట్స్!

UPI Credit Line Facility : అకౌంట్​లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్.. ఎలాగంటే?

For All Latest Updates

TAGGED:

UPI
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.