How to Claim PF Withdrawal in Just 3 Hours : ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేసే చాలా మందికి పీఎఫ్ అంటే ఏంటో తెలుసు. వారు పనిచేసే కంపెనీ చెల్లించే వేతనంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా కంపెనీ కూడా అంతే మొత్తంలో ఖాతాకు జమ చేస్తుంది. సాధారణంగా ఈపీఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత తీసుకుంటుంటారు. కానీ ఆసుపత్రి ఖర్చులు, వివాహం, ఉన్నత చదువు, ఇంటి కొనుగోలు వంటి కారణాలతో కొంత మొత్తంలో నగదు తీసుకునే పాక్షిక విత్‌డ్రాలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) అనుమతిస్తుంది. పండగ సీజన్ కాబట్టి మీరు పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంతకుమునుపులా పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ కోసం ఏ పీఎఫ్ ఆఫీస్‌కు వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు చాలా సింపుల్‌గా ఆన్‌లైన్‌లో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
How to Claim Provident Fund Withdrawal in Telugu : మీరు ఈజీగా పీఎఫ్(Provident Fund) విత్‌డ్రా క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా ఆధార్ ప్రక్రియ పూర్తి చేసుకుని ఉండాలి. ఒకవేళ మీరు చెల్లుబాటు అయ్యే e Aadhaar కలిగి ఉంటే ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు మీ క్లెయిమ్‌ను 3 గంటలలోపు పరిష్కరిస్తుంది. గతంలో మాన్యువల్ విధానం కారణంగా నెల కంటే ఎక్కువ సమయం పడుతుండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. e Aadhaar ద్వారా ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు EPFO దరఖాస్తు దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే క్లెయిమ్‌లను పరిష్కరించే ప్రతిష్ఠాత్మక ప్రణాళికను కలిగి ఉంది. ఉదాహరణకు ఆన్‌లైన్ దరఖాస్తును దాఖలు చేసిన మూడు గంటలలోపు EPF ఉపసంహరణ క్లెయిమ్‌ను EPFO పరిష్కరించాలని యోచిస్తోంది.
ఆధార్ PF క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించిన EPFO..
EPFO Aadhaar enabled PF claim Settlement Process in Telugu : EPFO అందరు చందాదారులతో పాటు పెన్షనర్లు తమ ఆధార్ నంబర్‌ను సమర్పించడాన్ని తప్పనిసరి చేసింది. ఇది EPF ఖాతా, పెన్షన్ ఖాతా, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్(Aadhaar Number)ను లింక్ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఆన్‌లైన్‌లో ఉపసంహరణ, పెన్షన్ స్థిరీకరణ వంటి అనేక ఆన్‌లైన్ సౌకర్యాలను చందాదారులకు అందించడంలో సహాయపడుతుంది.
ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి?
What is Provident Fund ? : ప్రావిడెంట్ ఫండ్ అనేది వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టే ఆర్థిక సాధనం. ఇక్కడ EPFO నిబంధనల ప్రకారం.. జీతంలో 12% PF ఫండ్‌కు వెళ్లాలి. అంతేమొత్తంలో యజమాని కూడా దానికి జత చేస్తారు. ఇందులో 8.3% పెన్షన్ ఫండ్‌కు వెళ్తుంది. ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) అనేది వేతనాలు పొందే ఏ ఉద్యోగికైనా పదవీ విరమణ తర్వాత అత్యంత కీలకమైన ప్రణాళికలలో ఒకటి.
సాధారణంగా వేతనాలు పొందే ఉద్యోగులు తమ PF నిధులను మధ్యలో ఉపసంహరించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే నిధులు పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఉద్దేశించబడినవి. ఉద్యోగి 5 సంవత్సరాల పాటు ఫండ్‌ను ఉపసంహరించుకోకపోతే PF నిధులపై పన్ను ఉండదు. అలాగే PF ఫండ్లపై అందించే వడ్డీ రేటును EPFO ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది.
EPF Interest Earning : ఉద్యోగం మానేసిన తరువాత కూడా.. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అవుతుందా?
EPF Advance Withdrawal : అత్యవసరంగా డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోండిలా!