Gold Rate Today : దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర భారీగా పెరిగింది. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.61,132గా ఉండగా.. గురువారం రూ.61,162గా ఉంది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం కిలో వెండి ధర రూ.76,400 ఉండగా.. రూ.1000 పెరిగి రూ.77,400కు చేరుకుంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,162గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.77,400గా ఉంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,162గా ఉంది. కిలో వెండి ధర రూ.77,400కు చేరుకుంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,162గా ఉంది. కిలో వెండి ధర రూ.77,400గా ఉంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,162గా ఉంది. కిలో వెండి ధర రూ.77,400కు చేరుకుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ ధరలు మారుతూ ఉంటాయి గమనించవలెను.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1963 డాలర్లుగా ఉండగా.. గురువారం స్పాట్ గోల్డ్ ధర 1976 డాలర్లుగా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. ఔన్స్ వెండి ధర 24.97 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,10,727 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా, యూఎస్డీ కాయిన్ మాత్రం నష్టాల్లో ఉంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,10,727 |
ఇథీరియం | రూ.1,53,726 |
టెథర్ | రూ.81.98 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,808 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.98 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం ప్రపంచ మర్కెట్లపై సానుకూల ప్రభావం చూపడం వల్ల భారత స్టాక్ మార్కెట్ల సూచీలు గురువారం లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ ప్రస్తుతం 223 పాయింట్లు నష్టపోయి 66,484 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 51 పాయింట్లు నష్టపోయి 19,727 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
సన్‌ఫార్మా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, విప్రో, టాటా స్టీల్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు :
రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, టైటాన్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, కోటక్, యాక్సిస్ బ్యాంకుల స్టాక్‌లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.64గా ఉంది. డీజిల్ ధర రూ.98.42గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు ఎగబాకి రూ.81.91గా ఉంది.