Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.61,149గా ఉంది. మరోవైపు వెండి ధర భారీగా తగ్గింది. గురువారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.1090 తగ్గి రూ.76,960 పలుకుతోంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,149గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,960గా కొనసాగుతోంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,149గా ఉంది. కిలో వెండి ధర రూ.76,960గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,149గా ఉంది. కిలో వెండి ధర రూ.76,960 పలుకుతోంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,149గా ఉంది. కిలో వెండి ధర రూ.76,960గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర.. గురువారం 1970 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అదే రేటు వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 24.82 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,48,344 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్డీ కాయిన్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. బైనాన్స్ కాయిన్ మాత్రం లాభాల్లో ఉంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,48,344 |
ఇథీరియం | రూ.1,55,394 |
టెథర్ | రూ.82.3 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,977 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.2 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 11 పైసలు క్షీణించి రూ.82.04 వద్ద కొనసాగుతోంది.
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 694 పాయింట్లు నష్టపోయి 66,878 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 179 పాయింట్లు క్షీణించి 19,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
ఎల్ అండ్ టీ, ఐటీసీ, నెస్లే, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, మారుతీ, టాటా మోటార్స్, భారిత ఎయిర్టెల్, ఎన్టీపీసీ కంపెనీల్ల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు :
మహీంద్రా అండ్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, టెక్ మహీంద్రా, హెచ్‌యూఎల్, టాటా స్టీల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.