Gold Rate Today : దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.1,150 పెరిగి.. ప్రస్తుతం రూ.52,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,125 పెరిగి.. రూ.59,450 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది. కిలో వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,200వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,450 గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,662 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.51 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,67,994 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,67,994 |
ఇథీరియం | రూ.1,24,206 |
టెథర్ | రూ.82.31 |
బినాన్స్ కాయిన్ | రూ.23,619 |
యూఎస్డీ కాయిన్ | రూ.79 |
లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 205 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 59,965 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 53 పాయింట్లు ఎగబాకి 17,792 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 సూచీల్లో రిలయన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్జర్వ్, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, అల్ట్రాసెమ్కో, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో 4 పైసాలు లాభపడి.. ప్రస్తుతం 82.29కు చేరింది.
ఇవీ చదవండి: క్రికెట్ నేర్పే ఆర్థిక పాఠాలు.. ఇలా చేస్తే భవితకు ధీమా!
ఎలాన్ మస్క్ చేతికి 'ట్విట్టర్'.. పరాగ్ అగర్వాల్, గద్దె విజయపై వేటు