ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే.. - రూపాయి విలువ

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold rates today
బంగారం ధర
author img

By

Published : Oct 20, 2022, 11:03 AM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 పెరిగి ప్రస్తుతం రూ.51,820గా ఉంది. కేజీ వెండి ధర రూ.445 పెరిగి.. రూ.57,340 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,820గా ఉంది. కిలో వెండి ధర రూ.57,340 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.57,340గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,820గా ఉంది. కేజీ వెండి ధర రూ.57,340 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,820 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.57,340 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,636 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.55 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,82,113 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.15,82,113
ఇథీరియంరూ.1,06,428
టెథర్​రూ.83.9
బినాన్స్​ కాయిన్​రూ.22,493
యూఎస్​డీ కాయిన్రూ.83.11

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 65 పాయింట్లకు పైగా నష్టపోయి ప్రస్తుతం 59,040 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 6 పాయింట్లు దిగజారి 17,510 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్‌ 30 సూచీల్లో నెస్లేఇండియా, హెచ్​సీఎల్​టెక్​, పవర్​గ్రిడ్​, టీసీఎస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. మారుతీ, ఎం&ఎం, యాక్సిక్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ​, ఐసీఐసీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ గురువారం రికార్డు స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో 6 పైసలు నష్టపోయి.. ప్రస్తుతం 83.06కు చేరింది.

ఇవీ చదవండి: దీపావళికి పసిడి మెరుపులు.. గతేడాది స్థాయిలోనే ధర.. గిరాకీ ఆశావహం

రూ.1353 కోట్లతో దుబాయ్​లో మరో విల్లా కొన్న అంబానీ.. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.