Gold Rate Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.61,166గా ఉంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. మంగళవారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.280 పెరిగి రూ.77,555 పలుకుతోంది.
- Gold Price in Hyderabad : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.61,166గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.77,555గా కొనసాగుతోంది.
- Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,166గా ఉంది. కిలో వెండి ధర రూ.77,555గా ఉంది.
- Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,166గా ఉంది. కిలో వెండి ధర రూ.77,555 పలుకుతోంది.
- Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.61,166గా ఉంది. కిలో వెండి ధర రూ.77,555గా ఉంది.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price : శనివారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1976 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం అదే రేటు వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు సిల్వర్ ధరలు కూడా దాదాపు స్థిరంగానే ఉన్నాయి. ఔన్స్ వెండి ధర 25.05 డాలర్లుగా ఉంది.
క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency news : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ ధర రూ.24,65,873 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. ఇథీరియం, టెథర్, యూఎస్డీ కాయిన్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బైనాన్స్ కాయిన్ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ విలువలు ఇలా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.24,65,873 |
ఇథీరియం | రూ.1,56,976 |
టెథర్ | రూ.82.11 |
బైనాన్స్ కాయిన్ | రూ.19,894 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.10 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol and Diesel Prices : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.92గా ఉంది. డీజిల్ ధర రూ.98.78గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
రూపాయి విలువ!
Rupee Open : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోల్చితే 8 పైసలు తగ్గి రూ.82.12 వద్ద కొనసాగుతోంది.
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్..
Stock market Today : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 241 పాయింట్లు లాభపడి 67,036 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67.85 పాయింట్లు వృద్ధి చెంది 19,817 వద్ద ట్రేడ్ అవుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :
ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్, బ్రిటానియా, పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్ కంపెనీల్ల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌లు :
హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎం అండ్ ఎం, హెర్మోటోకో, హిందాల్కో, భారతి ఎయిర్టెల్.