ETV Bharat / business

తగ్గిన బంగారం ధర.. బిట్​కాయిన్​ విలువ ఎంతంటే?

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,970కు చేరింది. మరోవైపు బిట్​కాయిన్​ ధర భారీగా పడిపోయింది.

బంగారం
బంగారం
author img

By

Published : May 19, 2022, 11:04 AM IST

Gold price today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడిపై రూ.90 తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. బుధవారం రూ.62,740గా ఉన్న కిలో వెండి ధర రూ.544 తగ్గి రూ.62,196 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,970 వద్ద ఉంది. ఏపీ, తెలంగాణాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,900గా ఉంది. కిలో వెండి ధర రూ.62,196 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,196గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,196 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,196 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ స్పాట్​ గోల్డ్​ ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 1,814 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర.. ఔన్సుకు 21.42 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ.105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.50, లీటర్​ డీజిల్​ రూ.104.75. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.
Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియం, బినాన్స్​ కాయిన్​ సహా ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.23,77,926
ఇథీరియంరూ.1,59,337
టెథర్రూ.81.94
బినాన్స్​ కాయిన్రూ.24,142
యూఎస్​డీ కాయిన్రూ.82.4

Stock Market Closing: బుధవారం సెషన్​లో నష్టాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లోకి వెళ్లాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 1,105 పాయింట్లు కుప్పకూలి 53,102కి పడిపోయింది. నిఫ్టీ 314 పాయింట్లు క్షీణించి 15,926 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఐటీసీ, ఐచర్​ మోటార్స్​ ​ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హిండాల్కో టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

ఇదీ చూడండి : క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.