ETV Bharat / business

ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి గౌతమ్​ అదానీ

Gautam Adani net worth 2022: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ.. అమెరికాకు చెందిన ప్రముఖ మదుపరి వారెన్​ బఫెట్​ను వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్​-5లో చోటు దక్కించుకున్నారు. శుక్రవారం మార్కెట్​ ముగింపు అనంతరం ఫోర్బ్స్​ విడుదల చేసిన కుబేరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.

Gautam Adani
ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి గౌతమ్​ అదానీ
author img

By

Published : Apr 25, 2022, 8:38 PM IST

Gautam Adani net worth 2022: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌-5లో చోటు దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ మదుపరి వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టి 123.7 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ కుబేరుల ఐదో స్థానంలో నిలిచారు. శుక్రవారం మార్కెట్‌ ముగింపు అనంతరం ఆయన ఈ మైలురాయిని చేరుకున్నారు.

పోర్టులు, విమానాశ్రయాల నిర్వహణ వంటి వ్యాపారాలతో పాటు ఎఫ్‌ఎంసీజీ రంగంలోనూ అదానీ రాణిస్తున్నారు. ఓ వైపు కొవిడ్‌ మహమ్మారి కారణంగా అన్ని దేశాలు, ఆర్థిక వ్యవస్థలూ అతలాకుతలం అవ్వగా.. అదానీ వ్యాపారాలు మాత్రం దూసుకెళ్లడం గమనార్హం. దీంతో ఒక్క 2022లోనే ఆయన సంపద 43 బిలియన్‌ డాలర్లు పెరిగింది. మొత్తంగా ఆయన సంపద ఈ ఏడాదిలో 56 శాతం పెరిగింది.

ముకేశ్‌ను వెనక్కి: భారత్‌తో పాటు ఆసియాలోనే కుబేరుడిగా మొదటి స్థానంలో కొనసాగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి తొలిసారి ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్‌ అదానీ టాప్‌-5లోకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో ప్రస్తుతం ఎలాన్‌ మస్క్‌ 269.7 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌ (170.2 బిలియన్‌ డాలర్లు), బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (167.9 బిలియన్‌ డాలర్లు), బిల్‌గేట్స్‌ (130.2 బిలియన్‌ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు

ఇదీ చూడండి: దిగొచ్చిన ట్విట్టర్.. ఎలాన్‌ మస్క్‌తో చర్చలు.. డీల్​ ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.