ETV Bharat / business

అప్పుల ఊబిలో చిక్కుకున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే కష్టమే - అప్పును ముప్పుగా మర్చొద్దు

అడగకుండానే అప్పు ఇస్తామంటూ ఫోన్లు, వడ్డీ లేని వాయిదాలు, ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి అంటూ ఆఫర్లు, అవసరం లేకున్నా రుణాలు తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు. ఒక్కసారి ఈ వలలో పడ్డామా, ఇక అంతే సంగతులు. రూపాయికి పది రూపాయలు చెల్లిస్తేగానీ బయటపడలేని పరిస్థితి. ఈ దారుణాలకు భయపడి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు నిత్యం ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. చేతులారా మనం అప్పుల ఊబిలో చిక్కుకోకుండా జాగ్రత్త తీసుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదు.

dont make debts as threat
Etv dont make debts as threat
author img

By

Published : Aug 26, 2022, 7:41 AM IST

అర్జున్‌ వయసు 35. ఏడేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. రెండేళ్ల క్రితం ఇల్లు కొన్నాడు. ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.లక్ష వరకూ ఆర్జిస్తున్నాడు. అంతా సాఫీగా సాగిపోతోంది అనుకుంటూ.. రెండేళ్ల క్రితం ఒక ఫ్లాటు కొన్నాడు. రుణానికి నెలకు రూ.40వేలు చెల్లిస్తున్నాడు. సొంతింట్లోకి మారిన తర్వాత కారు తీసుకున్నాడు. దీనికి నెలకు రూ.15,000 చెల్లిస్తున్నాడు. దీంతోపాటు.. కొన్ని ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు, బంగారం తాకట్టు పెట్టి అప్పు.. ఇలా రుణాల జాబితా పెంచుకుంటూ వెళ్లాడు. వచ్చిన ఆదాయం వచ్చినట్లుగానే రుణాల వాయిదాలకు చెల్లించేస్తున్నాడు. ఒక్కసారిగా ఇంటి ఖర్చులకూ ఇబ్బంది కావడం మొదలయ్యింది. పెట్టుబడులు పెట్టడం మానేశాడు.

వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి.. ఇక్కడ ఇది ఉదాహరణే కావచ్చు. కానీ, అర్జున్‌లాంటి వారెందరో ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు. సులువుగా రుణాలు దొరుకుతున్నాయని ప్రతి అవసరానికీ అప్పు చేయడమే దీనికి కారణం. ఆదాయం తగ్గట్టు ఖర్చులు పెట్టాలనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోవడమే సమస్యగా మారుతోంది. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే ఖర్చు చేసే ధోరణీ పెరిగింది. కారణం ఏదైనా సరే.. ఆర్థిక ప్రణాళిక ఒక్కసారి దెబ్బతింటే.. తిరిగి గాడిన పడటం కాస్త కష్టమే.

అర్థం చేసుకోవాలి..
రుణం తీసుకోవడం తేలికే. కానీ, దాన్ని తీర్చడానికి కొన్ని త్యాగాలు తప్పవు. ప్రాథమికంగా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి.

  • వేతనం, వడ్డీలు, డివిడెండ్లు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాలన్నింటికీ ఒక లెక్క ఉంటుంది. కానీ, ఖర్చులు కచ్చితంగా ఇంతే ఉంటాయని చెప్పలేం. ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించగలగాలి.
  • అవసరాలు, కోరికలు, విలాసాలు.. ఈ మూడింటి మధ్య తేడా స్పష్టంగా గుర్తించాలి. కోరికలను వాయిదా వేసుకునే శక్తి ఉండాలి. తాహతుకు మించిన విలాసాలు ఎప్పుడూ అప్పుల ఊబిలోకి నెట్టివేస్తాయని మర్చిపోవద్దు.
  • రుణం తీసుకోవడానికి ముందు.. దానికి తగ్గ ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి. ఇప్పటికే ఉన్న రుణాలు.. కొత్తగా తీసుకుంటున్న అప్పు.. వాయిదాలన్నింటినీ చెల్లించేందుకు మీ ఆదాయం సరిపోతుందా? చూసుకోవాలి.
  • అధిక వడ్డీ రేటుతో రుణాలు తీసుకోవడం ఎప్పుడూ చేటే. 10 శాతానికి మించి వడ్డీ చెల్లిస్తున్నామంటే.. అది మనకు దీర్ఘకాలంలో పెను భారం అని గుర్తించాలి.

మార్గమేమిటి?
ముందుగా.. శక్తికి మించిన అప్పులున్నాయనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. కాబట్టి, ముందుగా చేయాల్సిన పని మిగులు మొత్తాన్ని పెంచుకోవడం. అంటే ఖర్చులను తగ్గించుకోవడమే. అప్పుడే వాయిదాలను క్రమంగా చెల్లించేందుకు వీలవుతుంది.

  • మీ దగ్గరున్న మొత్తం డబ్బు ఎంత లెక్క తీయండి. బ్యాంకు డిపాజిట్లు, ఇతరులకు ఇచ్చిన అప్పులు, ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్లలో ఉన్న మొత్తం, స్థిరాస్తులు అన్నింటినీ చూసుకోండి. ఇందులో నుంచి ఇప్పటికిప్పుడు ఎంత వెనక్కి తీసుకోగలరో తెలుసుకోండి.
  • అప్పులు తీర్చేందుకు ఒక క్రమాన్ని రూపొందించుకోండి. 10 శాతానికి మించి వడ్డీ ఉన్న అప్పులను తొలి దశలో వదిలించుకోవాలి.
  • మిగులు మొత్తం పెరిగితే.. మీ శక్తి మేరకు ఈఎంఐ మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీనివల్ల తొందరగా రుణ భారం తగ్గుతుంది.
  • అనుకోని, తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే.. మీ స్థిరాస్తులలో తక్కువ విలువ ఉన్న వాటిని విక్రయించే ప్రయత్నం చేయొచ్చు.
  • అప్పూ లేనప్పుడు ఆర్థిక ప్రణాళిక అంతా సవ్యంగా సాగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపైనా దృష్టి సారించేందుకు వీలవుతుంది.

పరిమితి దాటకుండా..
అప్పు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం కాదు. మన ఆదాయాన్ని బట్టి, రుణ వాయిదాలు ఎంత ఉండాలన్నదానికి ఒక పరిమితి ఉంటుంది. అవేమిటంటే..

మీ మొత్తం ఆదాయంలో

  • ఇంటి రుణ వాయిదా 40 శాతానికి మించకూడదు.
  • క్రెడిట్‌ కార్డు పరిమితిలో 12 శాతానికి మించి వాడొద్దు.
  • కారు రుణానికి ఈఎంఐ 5 శాతం ఉండేలా చూసుకోవాలి.
  • వ్యక్తిగత రుణాల ఈఎంఐ ఆదాయంలో 2 శాతం కన్నా తక్కువుండాలి.

ఆస్తులను సృష్టించేవి మంచి అప్పులు.. అవసరానికి మించి ఖర్చు చేసేందుకు తీసుకునేవి చెడ్డ అప్పులు. మంచి రాబడిని ఆర్జిస్తామనే ఆశతో కొంతమంది రుణాలు తీసుకొని మరీ పెట్టుబడులు పెడుతున్నారు. వ్యక్తిగత రుణాలను తీసుకునేందుకు ఇదీ ఒక కారణమవుతోంది. మిగులు మొత్తమే పెట్టుబడులకు కేటాయించాలి. అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులతో మదుపు చేసినా.. ఫలితాలు ఆశించినట్లుగా ఉండవు.

ఇవీ చదవండి: 5జీ అందుబాటులోకి వచ్చేది అప్పుడే, ఆ నగరాల్లోనే ఫస్ట్

బ్యాంకింగ్‌ రంగంలో ఇబ్బందులున్నాయి, ప్రైవేటీకరిస్తే మరింత రిస్క్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.