Digital loans precautions : యూపీఐ ఆధారిత చెల్లింపుల విషయంలో ఇప్పటికే భారత్ ముందజలో ఉంది. చాలా ఫిన్‌టెక్ సంస్థలు యూపీఐ ద్వారా నగదు చెల్లింపులే కాకుండా రుణాలు తీసుకోనే సదుపాయాన్ని కూాడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. డిజీలాకర్, వీడియో ఆధారిత కేవైసీలాంటి వాటి ఆధారంగా రుణాలను అందిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో చాలా సులభంగా రుణాలు తీసుకోవడానికి డిజిటల్ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ప్రజలు సులభతరమైన పద్ధతిలో రుణాలను తీసుకుంటున్నారు. కానీ తరవాత భారీ వడ్డీలు భరించలేక రుణగ్రహీతలు ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల లోన్లు ఇచ్చే యాప్‌ల విషయంలో ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. అందువల్ల అప్పులు తీసుకోనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్బీఐ రిజిస్టర్డ్ కంపెనీల్లో రుణాలు...
RBI registered companies : రుణాలు తీసుకోనేటప్పుడు ఆర్బీఐ అనుమతి ఉన్న సంస్థలను ఎంచుకోవటం మంచిది. బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వాస్తవానికి ఆర్బీఐలో రిజిస్ట్రార్ అయ్యుండాలి. కానీ చాలా ఫ్రాడ్ సంస్థలు ఇందుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల అప్పు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ సంస్థ ఆర్బీఐ దగ్గర నమోదై ఉందా లేదా చూసుకోవాలి. ఫోన్లలో, యాప్‌లో రుణాలు ఇస్తున్న సంస్థలు తరవాత ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ అనుమతి లేకుండా రుణాలు ఇచ్చే సంస్థలకు దూరంగా ఉండాలి. ఇలాంటి వాటిపైన ఆర్బీఐ చర్యలు తీసుకున్నా.. చట్టవిరుద్ధంగా కొన్ని సంస్థలు ఇంకా రుణాలు అందిస్తున్నాయి.
స్కోరును అనుసరించి రుణాలు
Best Credit score : రుణాలు ఇవ్వడానికి ఆ వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోరును ఆర్థిక సంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. మంచి క్రెడిట్ స్కోరు (750 పాయింట్లు కంటే ఎక్కువ), స్థిరమైన ఆదాయం ఉంటే రుణం కోసం బ్యాంకులను ఎంచుకోండి. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉన్నా లేదా ఆదాయం తక్కువ ఉన్నా.. బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) నుంచి అప్పు తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. మీ క్రెడిట్ స్కోరును మంచిగా ఉండేలా చూసుకుంటే తక్కువ వడ్డీకే రుణం మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే క్రెడిట్ స్కోరును పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి.
వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్త!
Digital loans interest rates : అప్పు కావాలనుకున్న వెంటనే.. తక్కువ వడ్డీకి రుణం ఎవరు ఇస్తారా అని చూస్తాం. క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. ఇంతకముందు తీసుకున్న రుణాలు లేటుగా చెల్లించి ఉంటే స్కోరు తగ్గుతుంది. తక్కువ స్కోరు ఉంటే వడ్డీ రేటు పెరుగుతుంది. అప్పు తీసుకోనేటప్పుడు వడ్డీలను, రుసుములను జాగ్రతగా పరిశీలించాలి. అందులో సంవత్సరానికి చెల్లించే వడ్డీ రేటూ ఉందా లేదా చూసుకోవాలి. రుణాలు ముందుగా లేదా ఆలస్యంగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు విధిస్తారో తెసుకోవాలి. వాస్తవానికి రుణాలు అందించే సంస్థలు ఈ వివరాలను తప్పనిసరిగా రుణగ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటి గురించి చెప్పకపోతే.. ఆలాంటి సంస్థలు, యాప్‌ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
పోల్చి చూసుకోవాలి..
compare to other loan apps : ఆన్లైన్లో రుణం తీసుకొనేటప్పుడు ముందుగా వడ్డీ రేట్లు, రుసుముల చెల్లింపుల సమయంలో ఉండే నిబంధనలు చూసుకోవాలి. మిగిలిన సంస్థలూ ఎలాంటి షరతులు పెట్టాయనేది పోల్చి చూసుకోండి. అన్ని సంస్థలు ఈ సమాచారాన్ని ఆన్లైన్లో అందిస్తాయి.
క్రెడిట్ స్కోర్ రెగ్యులర్‌గా చెక్ చూసుకోవాలి
Credit score check : తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించటమే ఉత్తమం. ఇలా చేయటం వల్ల క్రెడిట్ స్కోరు మెరుగుపడతుంది. వాయిదాల చెల్లింపు ఆలస్యం అవుతుందని అనుకుంటే రుణదాతకు ఆ విషయాన్ని చెప్పండి. క్రెడిట్ స్కోరును సరిచూసుకుంటూ ఉండాలి. కొన్ని సార్లు రుణం చెల్లించిన విషయాన్ని రుణదాతలు క్రెడిట్ బ్యూరోలకు చెప్పటం మరిచిపోతారు. దీనితో స్కోరు తగ్గిపోతుంది. అందుకే రెగ్యులర్‌గా మీ క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేసుకోవడం మంచిది.
రుణగ్రహీత సమాచారం సురక్షితంగా..
Customer data protection : రుణగ్రహీత సమాచారాన్ని భద్రతంగా ఉండేలా ఆర్థిక సంస్థలు చూసుకోవాలి. రుణాన్ని ఇవ్వడానికి అవసరమైన సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. రికవరీ ఏజెన్సీలు, లోన్ ప్రొవైడర్లు లాంటి వాటికి నియంత్రిత పద్ధతిలో మాత్రమే సంబంధిత అంశాల్ని అందించాలి. ఈ మధ్యకాలంలో కొన్ని యాప్‌లు ఫోటోలు, వీడియోల లాంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి. తరవాత రుణగ్రహీతలను పలు విధలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందుకే ఇలాంటి ఫ్లాడ్ లోన్ యాప్‌ల వలలో పడకుండా జాగ్రతగా ఉండాలి.
సులభంగా రుణాలు ఇస్తున్నారు కదా అని అనవసరంగా తీసుకోవటం మంచిది కాదు. అవసరం ఉంటేనే అప్పు తీసుకోవాలి. అనవసరంగా రుణం తీసుకొని మోసపోయి ఇబ్బందులు ఎదుర్కోవటం కంటే ముందుగానే అన్నింటిని పరిశీలించి తీసుకోవటం మంచిది. స్తోమతకు మించి అప్పులు చేయటం కూడా సరైనది కాదు. ఎందుకంటే వాటిని తీర్చలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
రిటైర్మెంట్ ప్లాన్ ఇలా చేసుకోండి.. వృద్ధాప్యంలో డబ్బులకు ఢోకా ఉండదు!
Education Loan Tips : మీ విద్యా రుణం త్వరగా తీర్చేయాలా?.. ఈ టిప్స్ పాటించండి!