ETV Bharat / business

10 కోట్లు దాటిన డీమ్యాట్​ ఖాతాలు.. రెండేళ్లలో భారీగా పెరిగిన సంఖ్య - పెరిగిన డీమ్యాట్​ ఖాతాలు

దేశంలోని డీమ్యాట్​ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొవిడ్​ ముందు సుమారు 4 కోట్లు ఉన్న ఖాతాలు ఇప్పుడు ఏకాంగా పది కోట్లకు చేరిందని ట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ గణాంకాలు వెల్లడించాయి.

demat accounts
demat accounts
author img

By

Published : Sep 7, 2022, 8:31 AM IST

కొవిడ్‌ ముందు దేశంలో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 4.1 కోట్లు.. గత నెలాఖరుకు చూస్తే ఇవి 10 కోట్లను అధిగమించాయి. డిపాజిటరీ సంస్థలైన నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌డీఎస్‌ఎల్‌), సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (సీడీఎస్‌ఎల్‌) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రెండున్నరేళ్ల వ్యవధిలోపే దాదాపు 6 కోట్ల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయంటే.. ఈక్విటీ మార్కెట్లపై మదుపర్లకు ఎంతగా ఆసక్తి పెరిగిందో అర్థమవుతుంది.

లాక్‌డౌన్‌ సమయం నుంచీ..
కొవిడ్‌ కేసుల విస్తృతిని తగ్గించేందుకు 2020 మార్చిలో లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో స్టాక్‌మార్కెట్లు గణనీయంగా పతనమయ్యాయి. తదుపరి అనూహ్యంగా పుంజుకున్నాయి. లాక్‌డౌన్‌ ఫలితంగా సాఫ్ట్‌వేర్‌తో పాటు పలు రంగాల ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే అవకాశం లేకపోవడం, ఖాళీ సమయం ఎక్కువగా ఉండటంతో.. రెండో ఆదాయానికి మార్గంగా స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలపై పలువురు ఆసక్తి పెంచుకున్నారు. బ్యాంకు డిపాజిట్లపై ప్రతిఫలం తగ్గడం, తమ దగ్గర ఉన్న నగదుతో, మొబైల్‌ ద్వారానే స్టాక్‌మార్కెట్లలో క్రయ విక్రయాలు జరపగలగడం ఇందుకు ఉపకరించింది. స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన స్నేహితులు, సన్నిహితుల్లో కొందరు భారీ లాభాలు ఆర్జించడం చూసి, డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభించిన వారే అధికం. పలు పబ్లిక్‌ ఇష్యూలు కూడా, లిస్టింగ్‌ రోజే లాభాలు అందించడమూ యువతను ఆకర్షించింది.

భారీ అవకాశాలున్నాయ్‌

  • గణాంకాలను గమనిస్తే..మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్న సమయంలో డీమ్యాట్‌ కొత్త ఖాతాలు ఎక్కువగా ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో మార్కెట్లు నష్టపోగా, కొత్త డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 16 నెలల కనిష్ఠమైన 18 లక్షలకు పరిమితమవ్వడాన్ని ప్రస్తావిస్తున్నారు.
  • చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్రోకరేజీ సంస్థల వద్ద ఖాతాలు తెరుస్తుంటారు. అందువల్ల ఈ 10.05 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలు దాదాపు 6-7 కోట్ల మంది మదుపర్లకు చెంది ఉండొచ్చన్నది పరిశ్రమ అంచనా. అంటే దేశ ప్రజల్లో 6 శాతం మందే ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారని చెబుతున్నారు. ఈ విభాగంలో మరిన్ని పెట్టుబడులకు ఇంకా అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

ఇవీ చదవండి: సీటు బెల్టు పెట్టుకోకపోయినా బీమా.. మానవ తప్పిదాలున్నా క్లెయిం!

ఈ పోస్టాఫీసు పథకంతో రెట్టింపు రాబడి.. ఎన్ని నెలల్లో అంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.