ETV Bharat / business

డబ్బు విషయంలో ఈ భయాలున్నాయా? అయితే ఇది మీ కోసమే! - మనీ ఫియర్

Money Fears : మనలో చాలా మంది డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుతుంటాం. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటి.. వాటిని ఎలా అధిగమించాలో చూద్దామా?

common money fears
common money fears
author img

By

Published : Dec 12, 2022, 1:37 PM IST

డబ్బు మన జీవితంలోకి అనేక రకాల భావోద్వేగాలను మోసుకొస్తుంది. అందులో ప్రధానమైనది భయం. డబ్బుపై చాలా మందిలో ఉండే ఈ లక్షణం గురించి బయటకు మాట్లాడడానికి మనం పెద్దగా ఇష్టపడం. బాగా సంపాదిస్తున్నామని చెప్పడానికి సంకోచిస్తుంటాం. ఆదాయం ఉండడం లేదనీ చెప్పలేకపోతుంటాం. అంతలా డబ్బు, సంపాదన, ఆదాయం, ఆర్జనకు సంబంధించిన భయం మనలో తిష్ఠవేసుకొని కూర్చుంది. దాన్ని అధిగమించకపోతే ఆర్థికంగా విజయం సాధించడం కష్టం. మరి డబ్బుపై మనలో ఉండే కొన్ని భయాలు.. వాటిని ఎలా అధిగమించగలమో చూద్దాం...

డబ్బంతా పోతుందేమో..
డబ్బు సంపాదించడం కోసం మనం చాలా కష్టపడతాం. పొదుపు, మదుపును జీవితంలో భాగం చేసుకుంటాం. కానీ, తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు పెట్టుబడి మార్గాలు లేదా ద్రవ్యోల్బణం మూలంగా సంపాదించిన మొత్తంలో కొంత కోల్పోతుంటాం. ఒక్కోసారి మొత్తమూ పోవచ్చు. ఇదే మనలో భయానికి కారణమవుతుంటుంది. దీంతో పెట్టుబడి పెట్టడానికి సంకోచిస్తుంటాం. ఎవరికైనా ఇస్తే మోసం చేస్తారేమోనని వెనకాడుతుంటాం. ఇలా ఎలాంటి డబ్బుపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా భయపడుతుంటాం. ఫలితంగా సరైన మదుపు వల్ల వచ్చే ప్రయోజనాన్ని కోల్పోతాం.

అనవసర భయాలకు లోనుకాకుండా మనల్ని మనం సంసిద్ధుల్ని చేసుకోవాలి. చిన్న చిన్న నిర్ణయాలతో డబ్బును ఎలా సక్రమంగా నిర్వహించాలో నేర్చుకోవాలి. పెట్టుబడి విషయంలో నిపుణుల సలహాలు తీసుకుంటే మేలు. తెలిసినవాళ్లనూ అడగొచ్చు. ఇలా క్రమంగా ఒక్కో సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకుంటే తప్పుడు నిర్ణయాలకు ఆస్కారం ఉండదు.

ఉద్యోగం ఊడిపోతే..
డబ్బు సంపాదించడానికి ఉద్యోగమో లేక ఏదైనా వ్యాపారమో చేయక తప్పదు. చాలా మందిలో తమ ఉపాధి మార్గంపై అభద్రత ఉంటుంది. ఎక్కడ ఉద్యోగం పోతుందో లేక వ్యాపారం దెబ్బతింటుందోనని చింతిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కంపెనీలు ఎడాపెడా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ భయం మన పనితీరుపై ప్రభావం చూపుతుంది. పరోక్షంగా అది మన ఆదాయ మార్గాలనూ దెబ్బతీస్తుంది.

అందుకే ఉద్యోగం పోతుందనో లేక వ్యాపారంలో నష్టపోతామనో భయపడకుండా.. మరింత సమర్థంగా పనిచేయడంపై దృష్టి సారించాలి. నైపుణ్యాల్ని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అప్పుడు మిమ్మల్ని తీసేయడానికి యాజమాన్యాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. ఒకవేళ తీసేసినా నైపుణ్యం ఉంటే మరో ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. వ్యాపారం విషయానికి వస్తే.. కొత్త ఒరవడులను అందిపుచ్చుకోవాలి. నెట్‌వర్క్‌ను విస్తరించుకుకోవాలి. కస్టమర్లకు కొత్త ఉత్పత్తులను అందించేందుకు కృషి చేయాలి.

సరిపడినంత డబ్బు సంపాదించలేమేమో..
మనకు కావాల్సినంత సంపదను ఆర్జించలేమేమోనని చాలా మంది చింతిస్తూ ఉంటారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా వృద్ధాప్యంలో వైద్యపరమైన లేదా ఇతర అత్యవసర ఖర్చులకు ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బు సరిపోదేమోనని భయపడుతుంటారు. కానీ, ఇవన్నీ నిర్హేతుకమైన అపోహలు.

సరైన ప్రణాళిక ఉంటే ఈ భయం అక్కర్లేదు. మలిదశ జీవితం కోసం రిటైర్‌మెంట్‌ పథకాల్లో మదుపు చేయాలి. ఇతర ఆర్థిక అవసరాలనూ ముందుగానే అంచనా వేసి సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

డబ్బు నిర్వహణలో తప్పు దొర్లుతుందేమో..
మనం చాలా కష్టపడి సంపాదిస్తాం. అందుకే ఒక్క రూపాయి పోగొట్టుకోవాలన్నా భయపడుతుంటాం. ఈ క్రమంలో చాలా మంది సంపాదించే డబ్బును ఊరికే అలా పొదుపు చేసుకుంటూ ఉంటారు. దేంట్లోనైనా పెట్టుబడి పెడితే నష్టపోతామేమోనని జంకుతుంటారు. నిర్ణయం తీసుకోవడానికే భయపడిపోతుంటారు. తప్పు జరిగితే ఉన్నదంతా పోతుందేమోనన్న భయం వెంటాడుతుంటుంది.

ఇలా భయపడడానికి బదులు ఆర్థిక అంశాలపై అవగాహనను పెంచుకోవాలి. చిన్న చిన్న మదుపు మార్గాలతో పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలి. దాని ఫలాలు అందుతుంటే విశ్వాసం పెరుగుతుంది. తక్కువ నష్టభయం ఉన్న మదుపు మార్గాల్ని ఎంచుకోవాలి. అలాగే ఒక లక్ష్యంతో పెట్టుబడి పెట్టాలి. అలా లక్ష్యాలు అందుకుంటున్న కొద్దీ విశ్వాసం పెరిగి భయం తొలగిపోతుంది.

ఆన్‌లైన్‌ లావాదేవీలపై అపోహలు..
ఇప్పుడు ఆన్‌లైన్‌ లావాదేవీలు సర్వసాధారణమై పోయాయి. కానీ, ఇప్పటికీ చాలా మంది తమ వివరాల్ని డిజిటల్‌ మాధ్యమాల్లో ఎంటర్‌ చేయడానికి జంకుతుంటారు. ఎక్కడ తమ వివరాల్ని ఇతరులు దొంగిలిస్తారోనని భయపడుతుంటారు. నిజానికి సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం. కానీ, జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నష్టమూ జరగదు.

బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితో పంచుకోవద్దు. ఆన్‌లైన్‌ అకౌంట్లకు సంబంధించిన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు ఎవరితో షేర్‌ చేసుకోవద్దు. ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. బ్యాంకుల్లో మన వివరాలను తాజాపరుస్తూ ఉండాలి.

భయం అనేది ఒక బలమైన భావోద్వేగం. అది మన మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. డబ్బు గురించి ఆలోచించడం, ఆర్థికంగా అప్రమత్తత పాటించడం చాలా ముఖ్యం. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళిక వేసుకుని సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఇవీ చదవండి: వడ్డీ రేట్ల పెంపుతో హోంలోన్ భారం అవుతోందా? అయితే ఇలా చేయండి!

'బీమా రంగం కొత్త పుంతలు.. డిజిటలీకరణతో సులభంగా సేవలు..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.