గతంతో పోలిస్తే దేశంలో కార్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మార్చి నెలలోనే దాదాపు 3.36 లక్షల కార్ల విక్రయాలు జరిగాయని ఆయా కంపెనీలు వెల్లడించాయి. ఇంత భారీ స్థాయిలో కార్లు అమ్ముడుపోవడం కూడా బహుశా ఇదే తొలిసారి కావచ్చు. దీనికి ప్రధాన కారణం మధ్య తరగతి కుటుంబాల తలసరి ఆదాయం గణనీయంగా పెరగడం. దీంతో పాటు దేశంలోని అన్ని బ్యాంకులు కార్ల కొనుగోలుకు యథేచ్ఛగా రుణాలు ఇవ్వడం మరో ప్రధాన కారణంగా విశ్లేషించొచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు సాధారణంగా కారు ఆన్-రోడ్ ధరలో 80% నుంచి 90% వరకు తమ కస్టమర్లకు రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే వెహికిల్ లోన్స్ తీసుకునే ముందు వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ ఛార్జీలు సహా ఇతర ఛార్జీల గురించి కూడా ప్రతి వినియోగదారుడు తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
కొన్ని ప్రముఖ బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేసే కారు రుణాల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- ICICI bank vehicle loan interest rate : ఐసీఐసీఐ బ్యాంక్ 8.75% వడ్డీ వసూలు చేస్తోంది.
- HDFC vehicle loan interest rate : హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో వడ్డీ రేటు 8.75%
- IDBI vehicle loan interest rate : ఐడీబీఐ బ్యాంక్- 8.75%
- SBI vehicle loan rates : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.60%
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 10.05%
- బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.40%
- బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8.25%
- కరూర్ వైశ్యా బ్యాంక్- 9.35%
- పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.60%
- ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 11.00%
- తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్- 10.35%
- యూనియన్ బ్యాంక్- 8.80%
- Axis bank vehicle loan interest rate : యాక్సిస్ బ్యాంక్- 8.55%
- Canara bank vehicle loan interest rate : కెనరా బ్యాంక్- 9.15%
- కర్ణాటక బ్యాంక్- 9.26%
గమనిక: సదరు బ్యాంకులు తెలిపిన అత్యల్ప వడ్డీ రేట్లను మాత్రమే ఇక్కడ వివరించాం. అయితే మీకు వర్తించే వడ్డీ రేట్లలో పలు మార్పులు ఉండొచ్చు. అవి మీరు తీసుకున్న వెహికిల్ లోన్ మొత్తం, క్రెడిట్ స్కోరు, మీరు చేసే ఉద్యోగం లేదా వృత్తి, ఆయా బ్యాంకులు విధించే ఇతర నిబంధనలు, షరతులపై ఆధారపడి ఉంటుంది.
హ్యుందాయ్ కార్ల విందు..
కారు కొనాలనే కలను తీర్చుకునేందుకు పలు కార్ల కంపెనీలు కూడా వినియోగదారులకు అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మోడల్‌ను బట్టి ఆయా కార్లకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. తాజాగా కొరియన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ కారు ప్రియులకు తీపి కబురు చెప్పింది. ఆ కంపెనీ తయారు చేసిన కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఏఏ కార్ ఎంత ధరకు, ఏ రంగుల్లో, ఎంత డిస్కౌంట్ లభిస్తుందో వంటి విషయాలు తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.