ETV Bharat / business

క్రెడిట్ కార్డులు ఎన్నైనా ఉండొచ్చా? ఎక్కువ ఉంటే ఇబ్బందా?

multiple credit cards: క్రెడిట్ కార్డుల గురించి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండొచ్చు? ఎక్కువ కార్డులు ఉంటే ఏమైనా ఇబ్బందులా? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. కార్డ్‌ల సంఖ్య.. మీ ఖర్చు, అలవాట్లు, మీ జీవనశైలి, ఎక్కువ కార్డ్‌లను నిర్వహించడంలో మీ సామర్థ్యం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం..

credit card
క్రెడిట్‌ కార్డు
author img

By

Published : Jul 4, 2022, 2:09 PM IST

multiple credit cards: క్రెడిట్‌ కార్డులను సరిగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ ఖర్చులపై రాయితీ కూడా పొందొచ్చు. చాలా సందర్భాలకు ఒకే కార్డు అవసరమైనప్పటికీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ కార్డులు ఉండడం అదనపు ప్రయోజనాన్ని కల్పిస్తాయి. చాలా మందికి ఎన్ని క్రెడిట్‌ కార్డు లు ఉండాలనే విషయంపై సందేహం ఉంటుంది. దీన్ని ఎలా నిర్ణయించుకోవాలో చూద్దాం..

ఒకే కార్డు ఉంటే..: మీరు మొదటిసారి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు క్రెడిట్ హిస్టరీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీ ఆదాయం, ఖర్చుల ఆధారంగా ప్రత్యేకమైన లేదా ప్రీమియం క్రెడిట్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత ఉండదు. అటువంటి సందర్భాల్లో, మీరు ముందుగా మీ ఆదాయం, ఖర్చుల అవసరాల ఆధారంగా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ కార్డ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడానికి బిల్లును సకాలంలో చెల్లించాలి. అలా మరిన్ని ప్రయోజనాల కోసం ప్రీమియం క్రెడిట్ కార్డ్‌కు అర్హత పొందొచ్చు.

ఎక్కువ కార్డులు ఉంటే ప్రయోజనాలు..: ప్రతి క్రెడిట్ కార్డ్‌కు ప్రత్యేక ఫీచర్లు, ప్రయోజనాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక క్రెడిట్ కార్డ్ మీకు ప్రయాణ టిక్కెట్ బుకింగ్‌పై తగ్గింపులను అందిస్తుంది. మరొక క్రెడిట్ కార్డ్ మీకు ఆన్‌లైన్ షాపింగ్ లేదా విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ సౌకర్యంపై తగ్గింపునిస్తుంది. అటువంటి ప్రయోజనాలను పొందడానికి, మీరు ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండొచ్చు.

గడువు తేదీలు చెక్‌ చేసుకోవాలి..: బహుళ క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉండటం వల్ల మీరు అధిక మొత్తం క్రెడిట్ పరిమితిని పొందవచ్చు. క్రెడిట్ కార్డ్‌లలో ఒకదానిపై పరిమితి అయిపోయినట్లయితే, మీరు మరొక క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించుకోవచ్చు. బహుళ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు మీ ఖర్చును వివిధ కార్డ్‌లకు విభజించుకోవచ్చు. ఫలితంగా క్రెడిట్ యుటిలైజేషన్‌ రేషియోని సులభంగా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మరోవైపు బిల్లింగ్‌ సైకిల్‌ వేర్వేరు గడువు తేదీలతో క్రెడిట్ కార్డ్‌లను పొందవచ్చు. తద్వారా ఎక్కువకాలం వడ్డీ రహిత క్రెడిట్ ప్రయోజనాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది.

బహుళ క్రెడిట్‌ కార్డుల ఎంపిక ఇలా..: మీరు మీ ఆర్థిక అలవాట్లు, జీవనశైలి ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను ఎంచుకోవచ్చు. ఖర్చు చేసేదాన్ని బట్టి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను పొందొచ్చు. ఉదాహరణకు, మీరు తరచుగా విమానంలో ప్రయాణిస్తుంటే, ఎయిర్ మైల్స్ క్రెడిట్ కార్డ్‌ని పరిశీలించొచ్చు. క్రమం తప్పకుండా హోటళ్లలో ఉంటే, ట్రావెల్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తరచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటే, మీరు షాపింగ్ క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవచ్చు. కేవలం వన్-టైమ్ ఖర్చులను కవర్ చేయడానికి కార్డ్‌లను తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మరోవైపు బహుళ కార్డ్‌లను పొందుతున్నప్పుడు అమెక్స్‌, వీసా, రూపే, మాస్టర్‌ కార్డు వంటి విభిన్న జారీదారుల నుంచి పొందవచ్చు. ఫలితంగా ఎక్కువ ఆఫర్లు, రాయితీలు పొందడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

ఎన్ని కార్డులు ఉంటే మంచిది..: కార్డ్‌ల సంఖ్య మీ ఖర్చు అలవాట్లు, మీ జీవనశైలి, ఎక్కువ కార్డ్‌లను నిర్వహించడంలో మీ సామర్థ్యం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇవీ చదవండి: ఉమ్మడిగా హోమ్​లోన్ తీసుకుంటున్నారా?.. ఈ టిప్స్​తో తక్కువ వడ్డీ, అధిక రుణం!

ఈ పోస్టాఫీస్​ పొదుపు పథకాలు తెలుసా? వడ్డీ రేటు 7% పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.