Best Cars Under 7 Lakhs : ఆటోమొబైల్ కంపెనీలు ఈ పండుగ సీజన్లో తమ బ్రాండెడ్ కార్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తున్నాయి. కొన్ని కార్లపై ఏకంగా రూ.70,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. పైగా ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, కార్పొరేట్ బోనస్‌లను అదనంగా అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం.. మీ బడ్జెట్ కనుక రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్యలో ఉంటే, ఈ పండగ ఆఫర్లను చక్కగా ఉపయోగించుకోండి.
మారుతి సుజుకి ఆఫర్స్
Maruti Suzuki Festival Offers 2023 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈ దసరా పండగ సీజన్లో.. సెలెరియో, ఎస్-ప్రెస్సో, వ్యాగనార్ కార్లపై బంపర్ ఆఫర్స్ అందిస్తోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki S-Presso :
- ఈ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ కారు చాలా స్టైలిష్ లుక్‌లో ఉంటుంది. దీనిలో 1.0 లీటర్ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 68 పీఎస్ పవర్, 90 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ ఏఎంటీ అనుసంధానం కలిగి ఉంటుంది.
- సీఎన్జీ వేరియంట్లోని ఇంజిన్ 56 పీఎస్ పవర్, 82 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5 స్పీడ్ మాన్యువల్ అనుసంధానం కలిగి ఉంటుంది.
- మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సహా, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. కారు ముందు భాగంలో 2 సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్ సహా, రియర్ పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్ విత్ ఈబీడీ కూడా ఉన్నాయి.
Maruti Suzuki S-Presso Price :
- VXi Plus - రూ.6.10 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
- VXi(O) AMT - రూ.6.39 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
- LXi S-CNG - రూ.6.55 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
Maruti Suzuki Celerio
- బడ్జెట్లో బెస్ట్ కారు ఏదైనా ఉందంటే అది మారుతి సుజుకి సెలెరియో అని చెప్పకతప్పదు. దీనిలోని 1.0 లీటర్ సామర్థ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ స్పీడ్ అనుసంధానం కలిగి ఉంటుంది.
- మారుతి సుజుకి సెలెరియో కారులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. కారు ముందు భాగంలో 2 సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. అలాగే ఈ కారులో హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్ విత్ ఈబీడీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
Maruti Suzuki Celerio Price :
- LXi - రూ.5.9 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
- VXi - రూ.6.45 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
Maruti Suzuki WagonR
- ఈ మారుతి సుజుకి వ్యాగనార్ 2 ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0 లీటర్ ఇంజిన్ 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. సీఎన్జీ ఆప్షన్ విషయానికి వస్తే.. అందులోని ఇంజిన్ 57 పీఎస్ పవర్, 82 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ అనుసంధానంతో వస్తాయి.
- 1.2 లీటర్ కె12 ఇంజిన్ 90పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్ విడుదల చేస్తుంది. ఇది కూడా 5 స్పీడ్ మాన్యువల్ అనుసంధానంతో వస్తుంది.
- ఈ మారుతి సుజుకి వ్యాగనార్ కారులో.. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, పవర్డ్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ ఉన్నాయి.
Maruti Suzuki WagonR Price :
- LXi - రూ.6.13 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
- VXi - రూ.6.61 లక్షలు (ఆన్‌రోడ్ ప్రైస్)
Renault Kwid Climber
ఈ రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ కారులో 1.0 లీటర్ సామర్థ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 67 బీహెచ్పీ పవర్, 91 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్మాల్ ఎస్యూవీ కారుపై ప్రస్తుతం రూ.50,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. బడ్జెట్ ధరలో మంచి కారు కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Renault Kwid Climber Price : ఈ రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ కారు ఆన్‌రోడ్ ప్రైస్ రూ.6.58 లక్షలు ఉంటుంది.
Tata Tiago XT(O)
టాటా టియాగో కారు సిటీల్లో ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ కారుకు 4-స్టార్ క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్ ఉంది. కనుక ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ టాటా టియాగోకు చెందిన వివిధ వేరియంట్లపై ఈ పండుగ సీజన్లో దాదాపు రూ.70,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Tata Tiago XT(O) Price : ఈ టాటా టియాగో ఆన్‌రోడ్ ధర రూ.6.66 లక్షల వరకు ఉంటుంది.
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన ధరలు కాస్త అటుఇటుగా ఉంటాయి. ఆయా పట్టణాలు, నగరాల్లో భిన్నమైన ఆఫర్లు ఉంటాయి. డీలర్స్ను అనుసరించి కూడా కారు డిస్కౌంట్స్, ఆఫర్స్ మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి.
Upcoming Cars In 2024 : అదిరిపోయే ఫీచర్స్.. సూపర్ మైలేజ్‌తో.. కొత్త ఏడాదిలో 24 నయా కార్స్ లాంఛ్!