ETV Bharat / business

ఈ 5 టూల్స్ మీ కారులో ఉంటే చాలు - షోరూమ్​ బండిలా ఉంటుంది! - Car Accessories

Best Car Accessories : మీ కారు ఎప్పుడూ తాజాగా, ఆకర్షణీయంగా ఉండాలనుకుంటున్నారా? అందుకోసం మీరు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మార్కెట్లో రూ. 500 రూపాయలకే దొరికే ఈ 5 కారు సంబంధిత ఉత్పత్తులను కొనుగోలు చేస్తే చాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Best Accessories for Car Clean
Best Car Accessories
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 11:21 AM IST

Best Accessories for Car Clean : కొత్తగా కారు కొన్నవారు.. కొంతకాలం ఎంతో అపురూపంగా చూసుకుంటారు. కానీ.. ఆ తర్వాత పరిస్థితి మారిపోతుంది. సరిగ్గా మెయింటెనెన్స్ చేయరు. గుర్తొచ్చినప్పుడు వాష్ చేయిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ.. ఇదొక్కటే సరిపోదు. వాషింగ్​తోపాటు మీ కారు(Car Care Tips) ఇంటీరియర్, ఎక్స్​టీరియర్ ఎల్లప్పుడూ క్లీన్​గా ఉండాలి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా 5 టూల్స్​ను మీ కారులో ఉంచుకోవడమే! మరి అవేంటి? వాటితో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

WD40 కిట్ : ఇది కారుకు సంబంధించిన ప్రాబ్లమ్స్​ను పరిష్కరించే మల్టీ-పర్సస్‌ లూబ్రికెంట్ అండ్‌ క్లీనర్(Multi Purpose Lubricant and Cleaner). బోల్ట్​లు విప్పటానికి, తుప్పు పట్టకుండా చూడటానికి, వాటిలో తరచూ అంటుకునే దుమ్ము, ధూళిని తొలగించడానికి ఈ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ కారు టూల్‌కిట్‌లో దీనిని తప్పక ఉండేలా చూసుకోవాలి. ఇది మార్కెట్లో 500 రూపాయల లోపే లభిస్తుంది.

కార్ పెర్ఫ్యూమ్ : నేటి బిజీబిజీ లైఫ్​లో ఆఫీస్ పనులు లేదా ఇతరత్రా కారణాల వల్ల ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కారు ఎక్కగానే మంచి సువాసన వస్తే ఎవరికైనా చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. అలాగే చాలా మందికి కారు ఎక్కగానే ఏసీ ఆన్‌ చేసుకోవడం అలవాటు. ఈ క్రమంలో మీరు కారులో కార్‌ పర్ఫ్యూమ్‌(Car Perfume)ను పెట్టుకున్నట్లయితే.. అది మీకు మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇవి కూడా మార్కెట్‌లో రూ. 500లోపే అందుబాటులో ఉంటాయి.

మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి!

కార్ బిన్ : ఇక చాలా మంది కారులో లాంగ్‌ జర్నీకి ప్లాన్ చేసుకున్నప్పుడు తినుబండారాలు, దుప్పట్లు, టవల్స్‌ లాంటివి తీసుకెళ్తుంటారు. ఇవన్నీ సీట్లపై పడేయడం ద్వారా కారు క్యాబిన్‌ చూడడానికి అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అందుకోసం మీరు కార్​ బిన్​ను యూజ్ చేస్తే సరిపోతుంది. చిన్న చిన్న ఐటమ్స్ అందులో ఉంచడం ద్వారా కారులో స్పేస్​ మిగలడంతో పాటు క్లీన్​గా కనిపిస్తుంది. డ్యాష్​బోర్డ్ లేదా డోర్ పాకెట్​లో దీనిని సెట్ చేసుకోవచ్చు. దీనికీ రూ.500 లోపే ఖర్చవుతుంది.

మైక్రోఫైబర్ క్లాత్ : మీ కారు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌ను శుభ్రంగా ఉంచుకోవడానికి కావాల్సిన మరో ఇంపార్టెంట్ టూల్.. మైక్రోఫైబర్ క్లాత్. మీ కారు పై ఉన్న దుమ్ము, మురికిని చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇది కూడా మార్కెట్లో రూ. 500 ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ మైక్రో ఫైబర్‌ క్లాత్‌ను రీయూజ్‌ కూడా చేయవచ్చు. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటూ తక్కువ రేటుకే దొరుకుతుంది.

కార్ ఫాస్ట్ ఛార్జర్ : ఇక చివరగా.. కొందరు ఎక్కడికైనా వెళ్లేముందు తరచూ ఫోన్​కు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతుంటారు. ఇక తీరా కారులో ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడో లేదంటే లాంగ్ జర్నీలో ఉన్నప్పుడో ఈ విషయం గుర్తొస్తుంటుంది. ఆ టైమ్​లో మీ కారులో Car Fast Charger ఉంటే ఈ సమస్య ఉండదు. ఇందుకోసం మీరు ఎంతో ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఈ ఫాస్ట్ ఛార్జర్‌ని కూడా కేవలం రూ.500 ధరలోనే కొనుగోలు చేయవచ్చు.

మీ కారు విండ్‌ షీల్డ్‌పై పగుళ్లు వచ్చాయా? ఇలా సెట్ చేయండి!

డ్రైవింగ్​​ చేస్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా?-ఈ టిప్స్ తెలిసి ఉంటే ఈజీగా ప్రమాదం నుంచి బయటపడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.