ETV Bharat / business

ఆసియా-పసిఫిక్‌లో తగ్గిన ప్రయాణికుల రద్దీ.. ఈ ఏడాది 184 కోట్లే - ప్రపంచంలో అత్యధిక ప్రయాణించే ఎయిర్​లైన్స్

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఈ ఏడాది విమాన ప్రయాణికుల సంఖ్య తక్కువగానే నమోదవుతుందని ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌-ఏషియా పసిఫిక్‌ నివేదిక అంచనా వేసింది. దేశంలోకి విదేశీయులను అనుమతించడంలో జపాన్‌ జాగ్రత్త ధోరణే దీనికి కారణమని అభిప్రాయపడింది.

asia pacific airlines
ఆసియా పసిఫిక్‌ విమాన ప్రయాణికులు
author img

By

Published : Sep 20, 2022, 7:05 AM IST

అంతర్జాతీయ ప్రయాణికుల రాకపై చైనా కఠిన ఆంక్షలు, దేశంలోకి విదేశీయులను అనుమతించడంలో జపాన్‌ జాగ్రత్త ధోరణి వల్ల ఈ ఏడాది ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో విమాన ప్రయాణికుల సంఖ్య తక్కువగానే నమోదవుతుందని ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌-ఏషియా పసిఫిక్‌ నివేదిక అంచనా వేసింది.

'ప్రపంచంలో అత్యధిక విమాన ప్రయాణికుల విపణిగా ఆసియా-పసిఫిక్‌ నిలిచే అవకాశం లేద'ని పేర్కొంది. మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని ఈ నివేదికలో చేర్చలేదని ఏసీఐ-ఏషియా-పసిఫిక్‌ తెలిపింది. కొవిడ్‌ మహమ్మారికి ముందు పౌర విమానయాన విపణిలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం ఆధిపత్యం కొనసాగించిందని.. ఈ ఏడాది మాత్రం ప్రయాణికుల వాటాలో ఐరోపా తర్వాత రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావొచ్చని అంచనా వేసింది.

  • 2019లో ఆసియా-పసిఫిక్‌లో 338 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించిన 916 కోట్ల మందిలో ఈ వాటా 37 శాతం.
  • 2021లో ఆసియా పసిఫిక్‌ విమాన ప్రయాణికుల సంఖ్య 150 కోట్లకు పరిమితమై, ప్రపంచ విమానయాన విపణిలో ఈ ప్రాంత వాటా 33 శాతానికి తగ్గింది.
  • 2022లో ఆసియా పసిఫిక్‌ విమాన ప్రయాణికులు, కొవిడ్‌ ముందులో 55 శాతమైన 184 కోట్లకు చేరొచ్చన్నది అంచనా. ఇతర ప్రాంతాల్లో చూస్తే, 2019 ప్రయాణాల్లో 70-80 శాతానికి చేరుతున్నాయి.
  • హాంకాంగ్‌కు చెందిన ఏసీఐ-ఏషియా-పసిఫిక్‌ సంస్థ ఆసియా-పసిఫిక్‌, మధ్య ప్రాచ్య ప్రాంతాల్లోని 131 ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. వీరు 49 దేశాల్లో 618 విమానాశ్రయాలను నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి: ఎస్​బీఐ గుడ్​న్యూస్.. ఆ డిపాజిట్ పథకం మరోసారి పొడగింపు

ఈఎంఐ వడ్డీ భారం మోయలేకపోతున్నారా? ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.