ETV Bharat / business

మీడియా బిజినెస్​లోనూ అదానీ దూకుడు - న్యూస్​ ఏజెన్సీ IANSలో 50.5% వాటా కొనుగోలు - adani group company list

Adani Acquires Majority Stake In News Agency IANS : ఇండియన్ బిలయనీర్​ గౌతమ్ అదానీ మీడియా వ్యాపారంలోనూ తమదైన రీతిలో విస్తరిస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ న్యూస్ ఏజెన్సీ IANSలో సగానికిపైగా వాటాను కొనుగోలు చేశారు. అయితే ఎంత మొత్తానికి ఈ డీల్​ కుదిర్చుకున్నారో తెలియజేయలేదు.

Adani acquires IANS
Adani acquires majority stake in news agency IANS
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 12:54 PM IST

Adani Acquires Majority Stake In News Agency IANS : భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అపరకుబేరుడు గౌతమ్​ అదానీ మీడియా రంగంలోనూ తమ ఉనికిని మరింత విస్తరిస్తున్నారు. తాజాగా ఆయనకు చెందిన ఏఎంజీ మీడియా నెట్​వర్క్​ లిమిటెడ్​ (AMNL) ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'ఐఏఎన్​ఎస్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​' (IANS)​లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.

సగానికి పైగా కొనేశారు..
అదానీ ఎంటర్​ప్రైజెస్​ రెగ్యురేటరీ ఫైలింగ్​లో, తమ అనుబంధ సంస్థ అయిన ఏఎంజీ మీడియా నెట్​వర్క్ లిమిటెడ్​ (AMNL) - ఐఏఎన్​ఎస్ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్ (IANS)​లో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. అయితే ఎంత మొత్తానికి ఈ డీల్​ కుదిరిందో తెలియజేయలేదు.

ఏడాది క్రితమే మీడియా రంగంలోకి..
గౌతమ్ అదానీ గతేడాది మార్చిలో 'క్వింటిలియన్​ బిజినెస్ మీడియా'ను కొనుగోలు చేసి మీడియా వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఇది బిజినెస్ అండ్ ఫైనాన్సియల్​ న్యూస్​ డిజిటల్ మీడియా ప్లాట్​ఫారమ్​ బీక్యూ ప్రైమ్​ను నిర్వహిస్తుంది. అదానీ అక్కడితో ఆగకుండా గతేడాది డిసెంబర్​లోనే ఎన్​డీటీవీలో 65 శాతం వాటాను కొనుగోలు చేశారు. వాస్తవానికి దీనిని కూడా AMNL ద్వారానే కొనడం జరిగింది. అదానీ గ్రూప్​ తాజాగా IANS న్యూస్​ ఏజెన్సీని కూడా కొనుగోలు చేసి, తమ మీడియా వ్యాపారాన్ని మరింత విస్తరించింది.

లాభాల్లోని సంస్థనే కొనుగోలు చేశారు!!!
ఐఏఎన్​ఎస్​ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.11.86 కోట్లు మేరకు రెవెన్యూను సంపాదించింది. ఇలా మంచి లాభాలు సంపాదిస్తున్న సంస్థలో అదానీ గ్రూప్​ ఏకంగా 50 శాతానికి పైగా వాటా కొనుగోలు చేయడం విశేషం. దీనితో ఐఏఎన్​ఎస్​లో కార్యనిర్వహణ బాధ్యతలు ఏఎంఎన్​ఎల్​ ఆధ్వర్యంలోకి వచ్చాయి. దీనితో పాటు IANS​ సంస్థలో డైరెక్టర్లను నియమించే హక్కు కూడా AMNLకు దఖలు పడింది. అంటే ఐఏఎన్​ఎస్​ అనేది ఏఎంఎన్​ఎల్​ అనుబంధ సంస్థ అయ్యింది.

అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తోంది..
Adani Group Company List : అదానీ 1988లో ఒక సాధారణ సరుకల వ్యాపారిగా (కమొడిటీ ట్రేడర్)​గా జీవితాన్ని ప్రారంభించారు. తరువాత 13 ఓడరేవులను, 8 విమానాశ్రయాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. భారత ఇన్​ఫ్రాస్ట్రెక్చర్​ రంగంలోని అతిపెద్ద ప్రైవేట్​ వ్యాపారవేత్తగా నిలిచారు. అలాగే ఆయన కోల్​, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్​, డేటా సెంటర్స్​ సహా, ఇటీవల సిమెంట్​, రాగి ఉత్పత్తి రంగాల్లోకి కూడా తమ బిజినెస్​ను విస్తరించారు. అంతేకాదు త్వరలో ప్రైవేట్ నెట్​వర్క్​ను ఏర్పాటు చేసేందుకు 5జీ టెలికాం స్పెక్ట్రమ్​ను కూడా కొనుగోలు చేశారు. ఈ విధంగా అదానీ అంచెలంచెలుగా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు.

డెబిట్ కార్డ్​తో ఫ్రీగా ఇన్సూరెన్స్​ కవరేజ్​! ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే?

తరచూ ప్రయాణాలు చేస్తుంటారా? ట్రావెల్ ఇన్సూరెన్స్​ తప్పనిసరి - ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.