ETV Bharat / business

ఆధార్​తో ఇంటర్నేషనల్​ మొబైల్ నంబర్​ లింక్ చేయవచ్చా? - ఆధార్​ కార్డ్ అప్డేట్ సమాచారం

Can You Use International Mobile Number On Aadhaar Card : దేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్​ గుర్తింపు కార్డు అతి ముఖ్యం. అయితే చాలా మందికి ఆధార్​తో మొబైల్​ నంబర్​ లింక్​ చేసే విషయంలో పలు అనుమానాలు ఉంటాయి. ఆధార్​కు ఇండియన్​ మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వాలా? లేదా ఇంటర్నేషనల్​ నంబర్ కూడా​ లింక్​ చేయవచ్చా? అని.. మరి అసలు విషయం ఏమిటో తెలుసుకుందామా?

Can I link a foreign mobile number to an Aadhaar card
Can You Use International Mobile Number On Aadhaar Card
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 8:36 AM IST

Updated : Nov 4, 2023, 8:49 AM IST

Can You Use International Mobile Number On Aadhaar Card : దేశంలోని ప్రతి ఒక్కరూ ఆధార్​ పొందడం చాలా అవసరం. ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఆధార్ అతి ముఖ్యం. ఆధార్ కేంద్రంలో మీ వ్యక్తిగత వివరాలు, ఐరిష్, ఫింగర్​ ప్రింట్స్ సబ్మిట్​ చేసి దానిని పొందవచ్చు. అలాగే మీ వివరాలు కూడా అప్​డేట్​ చేసుకోవచ్చు. అప్​డేట్ చేసే సమయంలో మొబైల్​ నంబర్​ను ఇవ్వాలి. అయితే ఆధార్​కు మొబైల్​ నంబర్​ అనుసంధానం ఎందుకు చేయాలి? ఇంటర్​ నేషనల్ మొబైల్​​ నంబర్​ను కూడా​ లింక్​ చేయొచ్చా? ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్​కు మొబైల్​ నంబర్​ ఎందుకు అవసరం?
ఆధార్​ అనేది ఒక విశిష్ఠ గుర్తింపు సంఖ్య. ఇందులో మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు ఉంటాయి. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్ సేవలను పొందేందుకు ఆధార్​కు మొబైల్​ నంబర్​ అనుసంధానం చేయడం అవసరం. అప్పుడే మీరు ప్రభుత్వం అందించే సేవలను సులువుగా పొందడానికి వీలవుతుంది. ఎప్పుడైనా మీరు మీ ఆధార్​ సమాచారాన్ని అప్​డేట్ చేయాలనుకుంటే ఓటిపి అవసరం అవుతుంది. ఆ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్​కు వస్తుంది. అందుకే మీ ఆధార్​కు మొబైల్​ నంబర్​ లింక్ చేయడం చాలా అవసరం.

ఇంటర్నేషనల్​ మొబైల్ నంబర్స్​ అనుసంధానం చేయవచ్చా?
Can I Link A Foreign Mobile Number To An Aadhaar Card : ఆధార్​తో కేవలం ఇండియన్ మొబైల్​ నంబర్స్​ను మాత్రమే లింక్​ చేసేందుకు వీలుంది. ఆధార్​ను జారీ చేసేటువంటి యూఐడిఏఐ ప్రస్తుతానికి అంతర్జాతీయ మొబైల్ నంబర్లను తీసుకోవడం లేదు. అందువల్ల కేవలం భారతీయ మొబైల్ ​నంబర్లనే ఆధార్​తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్​ఆర్​ఐలు ఆధార్​ కోసం కొత్తగా ఆప్లై చేసుకోవాలన్నా లేదా దానిని అప్​డేట్ చేయాలన్నా.. ఆధార్​ కేంద్రానికి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్​ఆర్​ఐలు వారి పాస్​పోర్ట్​ వివరాలను అందించి కొత్త ఆధార్​ కార్డును పొందవచ్చు. లేదా వారి మొబైల్​ నంబర్​ను ఆధార్​ కేంద్రానికి వెళ్లి అప్​డేట్ చేసుకోవచ్చు.

ఆధార్​ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఇచ్చేటువంటి 12 అంకెల విశిష్ఠ గుర్తింపు సంఖ్య. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, బ్యాంకింగ్ సేవలు పొందడానికి ఈ కార్డు చాలా అవసరం. ఒక వేళ మీకు ఇంకా ఆధార్​ కార్డు లేనట్లయితే.. వెంటనే దగ్గర్లోని నమోదు కేంద్రానికి వెళ్లి మీ వివరాలు నమోదు చేసుకోవాలి. మీ మొబైల్ నంబర్​ను దానికి అనుసంధానించుకోవాలి.

How To Lock Aadhaar Biometric Data : ఆన్​లైన్ ఫ్రాడ్స్ నుంచి రక్షణ పొందాలా?.. ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోండిలా!

ఆధార్​ కార్డుతో యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు! ఇకపై ఏటీఎం కార్డు అవసరం లేదు!!

Last Updated : Nov 4, 2023, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.