Share Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్లో లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ 157 పాయింట్లు వృద్ధి చెంది 58,807 వద్ద సెషన్‌ను ముగించింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 17,506 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 58,890 పాయింట్ల అత్యధిక స్థాయి, 58,341 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,543 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,380 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
Stock Market Top Gainers: ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.
Stock Market Top Losers: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, ఎన్టీపీసీ, నెస్లే, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇవీ చదవండి: