మంగళవారం సెషన్లో స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. బీఎస్ఈ- సెన్సెక్స్ (Sensex today) 663 పాయింట్లు పెరిగి ఆల్‌టైం గరిష్ఠస్థాయి అయిన 57,552 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 201 పాయింట్ల లాభంతో 17,132 వద్దకు చేరింది. లోహ, విద్యుత్ షేర్ల జోరు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బజాజ్ ఫినాన్స్ జంట షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి.
కరోనా కేసులు తగ్గడం సహా దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం వేగం పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జోరుగా ట్రేడింగ్ సాగించినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 57,626 పాయింట్ల అత్యధిక స్థాయి, 56,859 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,153 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,916 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
30 షేర్ల ఇండెక్స్‌లో నెస్లే, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, పవర్‌గ్రిడ్ షేర్లు తప్ప మిగతా షేర్లన్నీ లాభాలు నమోదు చేశాయి.
ప్రధానంగా భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్ మంచి పనితీరు కనబర్చాయి.
ఇవీ చదవండి: