భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 600 ప్లస్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు, దేశీయంగా ఆటో, మెటల్, బ్యాంకు రంగాలు పుంజుకోవటం వల్ల దేశీయ మార్కెట్లు రెండోరోజూ భారీ లాభాల్లో ముగిశాయి. మంగళవారం 497 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. సెన్సెక్స్ 611 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 16,900పైన స్థిరపడింది.
ముంబాయి స్టాక్ట్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్.. క్రితం ముగింపు కంటే 280 పాయింట్ల ఎగువన...56, 599 పాయింట్ల వద్ద ప్రారంభమై ఆద్యంతం అదే జోరు కనబరిచింది. చివరకు 611 పాయింట్ల లాభంతో 56,930 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ.. 184 పాయింట్లు లాభపడి 16,955 పాయింట్ల వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి..
- హిందల్కో, టాటా మోటార్స్, దివిస్ ల్యాబ్స్, బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్లు 2 శాతానికిపైగా లాభ పడ్డాయి.
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, విప్రో, ఐఓసీ, అదానీ పోర్ట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.