ETV Bharat / business

Stock Market: సూచీల ఊగిసలాట- మళ్లీ లాభాల్లోకి దేశీయ సూచీలు - sensex today live

stock market live updates
stock market live updates
author img

By

Published : Dec 9, 2021, 9:27 AM IST

Updated : Dec 9, 2021, 3:04 PM IST

14:57 December 09

సూచీల ఊగిసలాట..

స్టాక్​ మార్కెట్లు నేడు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. సూచీలు ఊగిసలాటకు లోనవుతున్నాయి.

సెన్సెక్స్​ ప్రస్తుతం 130 పాయింట్లు పెరిగి.. 58 వేల 780 ఎగువన కొనసాగుతోంది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో.. 17 వేల 510 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

ఐటీసీ, ఎల్​ అండ్​ టీ​, ఏషియన్​ పెయింట్స్​, యూపీఎల్​, రిలయన్స్​ రాణిస్తున్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టైటాన్​, నెస్లే ఇండియా, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, టీసీఎస్​ డీలాపడ్డాయి.

12:57 December 09

మళ్లీ లాభాల్లోకి..

దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు ఇవాళ కాస్త ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాల నుంచి తేరుకొని మళ్లీ లాభాల బాట పట్టాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 180 పాయింట్లు పెరిగి.. 58 వేల 830 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంతో 17 వేల 520 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

ఏషియన్​ పెయింట్స్​, ఎల్​ అండ్​ టీ, రిలయన్స్​, ఐటీసీ, యూపీఎల్​ లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​ కంపెనీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, నెస్లే ఇండియా, కోటక్​ మహీంద్రా, దివీస్​ ల్యాబ్స్​ డీలాపడ్డాయి.

10:02 December 09

స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లాయి. 132 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.. 58,517 వద్ద ట్రేడవుతోంది.

అటు నిఫ్టీ సైతం నష్టాల్లోకి వెళ్లిపోయింది. 40 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 17,430 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, లోహ, స్థిరాస్తి షేర్లు డీలా పడ్డాయి. ఈ ప్రభావం సూచీలపై పడింది

09:07 December 09

స్టాక్ మార్కెట్ లైవ్

Stock Market live updates: అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 230 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 58,880 వద్ద ట్రేడవుతోంది.

Nifty today live

మరోవైపు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల్లోనే పయనిస్తోంది. 60 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సూచీ.. 17,530 వద్ద కదలాడుతోంది.

సెన్సెక్స్ షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్ర, ఎల్ అండ్ టీ, రిలయన్స్ లాభాల్లో ఉన్నాయి. మారుతీ సుజుకీ, టీసీఎస్, ఎన్​టీపీసీ షేర్లు డీలా పడ్డాయి.

Last Updated : Dec 9, 2021, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.