Stock Market: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే.. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ 360కిపైగా పాయింట్ల లాభంతో.. 53,780 ఎగువన కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 100 పాయింట్లకుపైగా పెరిగి .. 16 వేల 100 ఎగువన ఉంది.
సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్, టీసీఎస్, ఎం అండ్ ఎం షేర్లు రాణిస్తున్నాయి.
కొటక్ బ్యాంక్, ఏషియన్పెయింట్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎన్టీపీసీ యాక్సిస్ బ్యాంకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ భయాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిరోజులుగా భారీగా పతనమైన షేర్లను మదుపర్లు కొనుగోలుకు మొగ్గుచూపడం వల్ల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.