నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బ్యాంకు సెక్టార్ మినహా.. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలు 1 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో.. సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 57,551 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 57,167 పాయింట్ల కనిష్ఠ, 58,141 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 57,684 పాయింట్ల వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 17,207 పాయింట్ల వద్ద స్థిరపడింది
లాభనష్టాల్లోనివి...
పవర్ గ్రిడ్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లాభాలతో ముగిశాయి.
కోల్ ఇండియా, హిందాల్కోలు 3 శాతానికిపైగా నష్టపోయాయి. యూపీఎల్, ఓఎన్జీసీ, సన్‌ఫార్మాలు 2.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.