వారాంతపు సెషన్‌ను స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. శుక్రవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ స్వల్పంగా 42 పాయింట్లు పుంజుకుని.. 48,733 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ అతి స్వల్పంగా 16 పాయింట్లు తగ్గి 14,678 వద్ద స్థిరపడింది. లోహ, ఆటో, ఐటీ రంగాలు నష్టాలను చవిచూశాయి.
దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతికి తోడు.. లాక్డౌన్ పొడిగింపు భయాలు మార్కెట్లను వెంటాడినట్లు నిపుణులు విశ్లేషించారు. ట్రేడింగ్ ఆసాంతం ఒడుదొడుకుల మధ్య సాగింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 48,899 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,473 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,750 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,592 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, నెస్లే, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐఎన్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ భారీగా నష్టపోయాయి.
ఇవీ చదవండి: ఫండ్లలో పెట్టుబడి ఉపసంహరణకు సరైన సమయం ఏది?