ETV Bharat / business

వార్షిక ఏడాదికి భారీ నష్టాలతో మార్కెట్ల స్వాగతం

దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ 8,400 మార్క్​కు దిగువన ట్రేడింగ్​ సాగిస్తోంది. కరోనా విజృంభణ కొనసాగుతుందనే భయాలే నష్టాలకు కారణం.

STOCKS
వార్షిక ఏడాదికి భారీ నష్టాలతో మార్కెట్ల స్వాగతం
author img

By

Published : Apr 1, 2020, 10:38 AM IST

కొత్త వార్షిక ఏడాదికి దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో స్వాగతం పలికాయి. కరోనా భయాలు మార్కెట్లను వెంటాడడమే ఇందుకు కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 714 పాయింట్లు కోల్పోయి 28,753 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 199 పాయింట్లు క్షీణించి 8,398 వద్ద కొనసాగుతోంది.

నష్టాల్లో...

కొటక్‌ బ్యాంక్‌ షేర్లు 8 శాతం మేర నష్టపోయాయి. ఎస్బీఐ, ఇన్ఫోసిస్‌, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టెక్​ మహీంద్రా, అల్ట్రాటెక్​ సిమెంట్​ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

లాభాల్లో...

హిమాద్రి స్పెషాలిటీ, జుబిలియంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.

కారణం...

  • అంతర్జాతీయంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడం.
  • ఈ ప్రభావం ఆర్థిక రంగంపై భారీ స్థాయిలో ఉండనుందన్న ఐరాస హెచ్చరికల నేపథ్యంలో మదుపర్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
  • ఈ పరిణామాలతో భారత్‌ సహా ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక్క షాంఘై సూచీ మాత్రం లాభాల్లో ఉంది.

రూపాయి...

డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.74 వద్ద ట్రేడవుతోంది.

చమురు ధరలు...

అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్​ 0.76 శాతం తగ్గింది. బ్యారెల్ ముడిచమురు ధర 26.15 డాలర్లకు చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.