ETV Bharat / business

మారటోరియం నేపథ్యంలో ఈఎంఐలు కట్టాలా? వద్దా? - rbi emi moratorium

దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ కారణంగా సామాన్యులు, చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ ఈఎంఐలపై 3నెలల మారటోరియం విధించింది ఆర్బీఐ. అయితే ఇది వేటికి వర్తిస్తుంది? బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలా? డబ్బులుంటే ఈఎంఐలు కట్టాలా? వద్దా? కట్టకపోతే ఏమైనా నష్టమా? ఒకవేళ ఈ సదుపాయం తీసుకుంటే రుణం విషయంలో ఎలాంటి మార్పులుంటాయి? ఇలా ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం.

whether-maratorium-benifit-emi-consumers-or-not
మారటోరియం నేపథ్యంలో ఈఎంఐలు కట్టాలా? వద్దా?
author img

By

Published : Apr 1, 2020, 6:40 AM IST

కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న దృష్ట్యా సామాన్యులకు ఊరటనిస్తూ రిజర్వు బ్యాంకు ఇటీవల కొన్ని కీలక ప్రకటనలు చేసింది. ఇందులో ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం ప్రధానమైనది. మారటోరియం అనగా వాయిదా అని చెప్పుకోవచ్చు. రిజర్వు బ్యాంకు ప్రకారం ఈ కాలంలో ఈఎంఐలు కట్టకపోయినప్పటికీ ఫెనాల్టీలు, అదనపు ఛార్జీలు ఉండవు.

మారటోరియం ఏఏ వాటికి వర్తిస్తుంది? బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలా? ఒకవేళ ఈ సదుపాయం తీసుకుంటే రుణం విషయంలో ఎలాంటి మార్పులుంటాయి? అసలు ఈఎంఐ కట్టే సదుపాయంతో పోల్చితే ఏ విధంగా ఇది ఉపయోగకరం? అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.

ఏఏ బ్యాంకులకు వర్తిస్తుంది?

ఈ మారటోరియం అన్ని రకాల బ్యాంకులకు వర్తిస్తుంది. ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, బ్యాంకింగ్​యేతర ఫైనాన్స్ సంస్థల్లో ఈ సదుపాయాన్ని వినియోగదారులు పొందవచ్చు.

బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయలా?

మారటోరియం ఉత్తర్వులను తప్పకుండా అనుసరించాలన్న నిబంధనను రిజర్వు బ్యాంకు విధించలేదు. దీనిపై బ్యాంకులే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్యాంకులు ఈ మారటోరియాన్ని అమలు చేయవచ్చు లేదా అమలు చేయకుండా ఉండవచ్చు. తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకైన ఎస్బీఐ.. ఆర్బీఐ నిర్ణయాలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్​ ఆఫ్ బరోడా, బ్యాంక్​ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లో కూడా మారటోరియం సదుపాయం ఉన్నట్లు ప్రకటించాయి.

అన్ని రకాల రుణాలకు..

మారటోరియం అన్ని రకాల టర్మ్ లోన్లకు వర్తిస్తుంది. గృహ రుణాలు, పర్సనల్, వాహన, వ్యవసాయ, పంట, కన్సూమర్ తదితర రుణాలు ఇందులో ఉన్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులకు కూడా ఇది వర్తిస్తుంది.

బ్యాంకులు మారటోరియాన్ని అమలు చేస్తే వినియోగదారులందరికీ ఆటోమేటిక్​గా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత లాక్​డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు ఎక్కువ సంఖ్యలో ప్రజలు వెళ్లే పరిస్థితి లేకపోవటమే కారణమని వారు అంటున్నారు.

'ఉంటే చెల్లించటమే మేలు' ...

డబ్బులున్నట్లయితే ఈఎంఐ చెల్లించటమే మేలని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు నెలల మారటోరియం కాలానికి అవుట్ స్టాండింగ్ రుణంపై వడ్డీని బ్యాంకులు విధిస్తాయి. దీనివల్ల ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డులపై సాధారణంగానే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు నెలల పాటు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించనట్లయితే వడ్డీ ఎక్కువ స్థాయిలో జమవుతుంది. దీనితో బిల్లు భారీగా వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.