13,500పైకి నిఫ్టీ..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 46,157 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 13,519 వద్ద కొనసాగుతోంది.
ఐటీ, ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. విదేశీ మదుపరుల నుంచి వస్తున్న కొనుగోళ్ల మద్దతు కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది.
- ఎం&ఎం, మారుతీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
- ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ముడిచమురు ధరల సూచీ-బ్రెంట్ 1.42 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర ప్రస్తుతం 49.37 డాలర్ల వద్ద ఉంది