ETV Bharat / business

రాణించిన ఐటీ, ఆర్థిక షేర్లు.. సెన్సెక్స్ 221 ప్లస్

Stock Market Today: మంగళవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 221 పాయింట్లు లాభపడింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పైగా ఎగబాకింది.

Sensex, Nifty end higher on a volatile day; metals drag, IT gains
స్టాక్​ మార్కెట్​కు లాభాలు
author img

By

Published : Jan 11, 2022, 3:42 PM IST

Share Market News Today: దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మంగళవారం సెషన్​ను తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభించిన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్​ 221 పాయింట్లు పెరిగి 60,617 వద్ద సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 52 పాయింట్లు లాభంతో 18,055 వద్ద స్థిరపడింది.

త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న ఆశల మధ్య ఆర్థిక, ఐటీ రంగాల జోరు కొనసాగింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 60,689 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,281 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,081 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,964 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

Stock Market Top Gainers: హెచ్​సీఎల్​ టెక్​, హెచ్​డీఎఫ్​సీ, టెక్​మహీంద్ర, టీసీఎస్​, రిలయన్స్​, సన్​ఫార్మా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

Stock Market Top Losers: టాటా స్టీల్​, బజాజ్​ ఫినాన్స్​, డాక్టర్​ రెడ్డీస్​, ఐటీసీ, కోటక్​ మహీంద్ర బ్యాంక్​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

అత్యధికంగా వోడాఫోన్​ ఐడియా షేర్లు 20 శాతానికి పైగా క్షీణించాయి.

ఇదీ చూడండి:

అంబానీని మించిన జావో- ప్రపంచ కుబేరుడైన క్రిప్టో బిలియనీర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.