ETV Bharat / business

సెన్సెక్స్​లో బుల్ జోరు- పెట్టుబడులు పెట్టొచ్చా? - stock markets news

దేశీయ స్టాక్ మార్కెట్లు జీవితకాల గరిష్ఠాల వద్ద కదలాడుతున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 50 వేల మార్క్​ను అందుకుంది. మార్కెట్లలో బుల్ రంకెలేస్తున్న ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? ఈ జోరు కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయా? మార్కెట్లకు అడ్డంకులు ఎదురవుతాయా? ఇలాంటి ప్రశ్నలపై నిపుణులు ఏమంటున్నారంటే..

Sensex is at its peak: Should you keep investing?
సెన్సెక్స్​లో బుల్ జోరు- పెట్టుబడులు పెట్టొచ్చా?
author img

By

Published : Jan 23, 2021, 6:11 AM IST

గత కొన్ని నెలలుగా స్టాక్ మార్కెట్లు బాగా వృద్ధి సాధించాయి. కరోనా వల్ల మార్చిలో పడిపోయిన మార్కెట్లు మళ్లీ కొవిడ్ కంటే ముందు స్థాయికి చేరుకోవటమే కాకుండా ఇప్పుడు ఆ స్థాయి కంటే ఎక్కువ వద్ద ట్రేడవుతున్నాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సైంజీ సూచీ ఇంట్రాడేలో మొదటి సారి 50వేల పాయింట్ల మైలురాయిని దాటింది. కేవలం మన దేశంలోని సూచీలే కాకుండా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు జీవన కాల గరిష్ఠాల వద్దనే ట్రేడవుతున్నాయి.

స్టాక్ మార్కెట్ల ఊపుకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు గాడిన పడతుండటమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు మనీ సర్కులేషన్​ను కేంద్ర బ్యాంకులు పెంచాయి. దీనితో లిక్విడిటీ సులభతరం అయిపోయింది. వడ్డీ రేట్లు జీవన కాల కనిష్ఠం వద్ద ఉన్నాయి. ఈ కారణాలతో ఈక్విటీ మార్కెట్లు రికవరీ అవుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం మార్కెట్లు ప్రతికూలంగా కదులుతాయని అనుకున్నప్పటికీ... ఉద్దీపనల ఆశలతో ఇంకా కొంచెం వృద్ధి సాధించాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

"అమెరికాలో జో బైడెన్ అధికారంలోకి వస్తే ట్యాక్స్ రేట్లు పెరుగుతాయన్న భావనలో ప్రతికూలంగా సూచీల గమనం ఉంటుందని అనుకున్నాం. కానీ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చేందుకు 2 బిలియన్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఉంటుందని ప్రకటించటంతో సూచీలు మరింత వృద్ధి సాధించాయి. పన్నులు వెంటనే పెరగకుండా... నెమ్మదిగా పెరుగుతాయని భావవతో ఇది జరిగింది. కేంద్ర బ్యాంకుల లిక్విడిటీ పాలసీ, వడ్డీ రేట్లు తగ్గటం, ట్రంప్ హయాంలో అమెరికా ఉద్దీపనలు ర్యాలీకి ఎక్కువగా దోహదపడ్డాయి"

-సతీష్ కంతేటీ, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్ మనీ

'ముందే ఊహిస్తాయి'

ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో రికవరీ కానప్పటికీ మార్కెట్ సూచీలు మాత్రం కొవిడ్ ముందు కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీని ఈక్విటీ మార్కెట్లు ముందే పసిగడతాయని.. మార్చిలో అదే జరిగిందని నిపుణులు అంటున్నారు. మార్చిలో సూచీలు పడిపోయిన అనంతరం ఆ త్రైమాసికం ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయని వారు వివరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ వృద్ధిని మార్కెట్లు ఊహిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

మార్కెట్ మార్కెట్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఓవర్ వ్యాల్యుయేషన్ లేదని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని స్టాక్స్ విషయంలో మాత్రం వాల్యుయేషన్ ఎక్కువగానే ఉందని వారు భావిస్తున్నారు. కొన్ని మాత్రం ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు.

'కరెక్షన్ ఉండొచ్చు'

సాధారణంగానే సూచీలు జీవన కాల గరిష్ఠాలను తాకిన అనంతరం కొంత కరెక్షన్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మార్చి నుంచి మార్కెట్ ర్యాలీ ఎక్కువగా ఉందని... మధ్యలో కొంత కరెక్షన్ ఉన్నప్పటికీ అర్థవంతమైన కరెక్షన్ లేదని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఏదైనా ట్రిగర్ దోహదపడుతుందని వారు అంటున్నారు.

"ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పరిశ్రమలు ముడిసరుకుల ధరలు పెరిగాయి. లోహలు, ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరిగాయి. కమొడిటీ ధరలు పెరిగాయి. దీనితో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దీనితో ధరల పెరుగుదలను కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. ఇది కూడా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ లో క్యాపిటల్ గెయిన్స్ పైన పన్ను పెంచుతారన్న చర్చ నడుస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, సులభతరమైన లిక్విడిటీ వల్ల కేవలం దేశీయ మార్కెట్లో కాకుండా అంతర్జాతీయ మార్కెట్లన్నీ ర్యాలీ అవుతున్నాయి. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ కఠినం అయ్యే సూచనలు ఉన్నా కూడా మార్కెట్లు కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది"

అమెరికా పన్నుల పెంపు కూడా మార్కెట్ కరెక్షన్​కు ట్రిగర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సమీప భవిష్యత్తులో సూచీలు భారీగా పెరిగే అవకాశాలు తక్కువేనని, ప్రస్తుతం వెలువడుతున్న త్రైమాసిక ఫలితాలు మంచి స్థాయిలో ఉంటే కొంచెం పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

జాగ్రత్తలూ...

మార్కెట్లు ట్రేడవుతున్న దృష్ట్యా... చిన్న తరహా పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని స్టాక్ మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

"కరెక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి స్వల్ప, మధ్య కాలం కోసం పెట్టుబడి పెట్టిన వారు కొంచెం కొంచెం లాభాలను తీసుకోవచ్చు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు స్వల్ప, మధ్య కాలం కోసం అయితే ప్రస్తుతం స్థాయిలో కాకుండా... కరెనక్షన్ ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టటం ఉత్తమం. అదే విధంగా దీర్ఘకాలం కోసం ఇప్పటికే పెట్టిన వారు స్టాక్ విలువ సమంజసంగా ఉన్నట్లయితే పెట్టుబడి కొనసాగించవచ్చు. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు ఒకే సారి కాకుండా విడతల వారీగా ఎంపిక చేసిన వాటిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు"

- సతీష్ కంతేటీ, స్టాక్ మార్కెట్ నిపుణులు, జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.