స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిశాయి. శుక్రవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 257 పాయింట్ల లాభంతో 48,206 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 14,823 వద్దకు చేరింది. మార్కెట్లు లాభాలతో ముగియటం వరుసగా ఇది మూడో సెషన్.
లోహ, ఆటో, పలు ఆర్థిక షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,417 పాయింట్ల అత్యధిక స్థాయి, 49,036 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,863 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,765 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, ఎం&ఎం, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. నిక్కీ, కోస్పీ లాభాలతో ముగిశాయి. షాంఘై, హాంగ్‌సెంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చదవండి:నెట్ సమస్యా? బీఎస్ఎన్ఎల్ 'బావ'కు చెప్పండి!