ETV Bharat / business

వడ్డీ రేట్లు, కరోనా కేసులే మార్కెట్లకు కీలకం

ఈ వారం మార్కెట్​ సూచీలు మిశ్రమంగా కదలాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్​బీఐ ప్రకటించనున్న కీలక వడ్డీ రేట్లు, పీఎంఐ డేటా, అంతర్జాతీయ మిశ్రమ పవనాలు మార్కెట్​లను ముందుకు నడిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

RBI policy decision, macro data, COVID-19 trends to drive markets this week: Analysts
ఈ వారం మార్కెట్లు: వడ్డీ రేట్లే కీలకం..కరోనాతో భయం
author img

By

Published : Apr 4, 2021, 1:32 PM IST

వడ్డీ రేట్లపై ఆర్​బీఐ ప్రకటన, పీఎంఐ డేటా, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, అంతర్జాతీయ పరిస్థితులు ఈ వారం స్టాక్ ​మార్కెట్లను నడిపించనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని లాభాల్లో ప్రారంభించిన సూచీలు ఈ వారంలో మిశ్రమంగా కదలాడే అవకాశం ఉన్నట్లు మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"ఇటీవల అమెరికా అధ్యక్షుడు పెట్టుబడులకు సంబంధించిన ఓ ప్రణాళికను ప్రకటించారు. దీంతో మదుపరులు అంతర్జాతీయ సూచనల ఆధారంగా పెట్టుబడులు పెట్టవచ్చు. రాబోయే త్రైమాసిక ఫలితాలుపైనా వారు దృష్టి సారించే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశీయంగా పెరుగుతోన్న కరోనా కేసులు, లాక్​డౌన్​ భయాలు మదుపరులను కొంత భయానికి గురి చేస్తాయి. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదముంది."

-సిద్ధార్థ్ ఖేమ్కా, మోతీలాల్​ ఓస్వాల్ రిటైల్ హెడ్

"ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏప్రిల్ 5 నుంచి 7 వరకు సమావేశం కానుంది. దీనితో పాటు తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ డేటా కూడా ఈ వారంలో ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు అంశాలు మదుపరులను ప్రభావితం చేయవచ్చు. దీంతో సూచీలు కొంతమేర ముందుకుసాగే అవకాశం ఉంది."

-రుస్మిక్ ఓజా, ఎగ్జిక్యూటివ్​ వైస్​ప్రెసిడెంట్, కోటక్ సెక్యూరిటీస్‌

"సూచీలు ఈ వారం పాజిటివ్​ ట్రెండ్​నే కొనసాగించే అవకాశం ఉంది. కానీ పెరుగుతోన్న కరోనా కేసులతో పాటు త్రైమాసిక ఫలితాలపై మదుపరులు దృష్టిసారించే అవకాశం లేకపోలేదు."

-అజిత్​ మిశ్రా, వీపీ రీసర్చ్​

ఇదీ చూడండి: రికార్డు స్థాయి జీఎస్​టీ వసూళ్లకు కారణాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.