దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price today) గురువారం మళ్లీ పెరిగాయి. దిల్లీలో (Petrol Price in Delhi) లీటరు పెట్రోల్‌పై 35 పైసలు పెరిగింది. లీటరు డీజిల్‌పై కూడా 35 పైసలు పెరిగింది. ఈ మేరకు ధరలను పెంచుతూ పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.79కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.93.53కు చేరింది.
ఆర్థిక రాజధానిలో..
ముంబయిలో (Petrol Price in Mumbai) లీటరు పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి.. రూ.110.71కి పెరిగిపోయింది. లీటరు డీజిల్ ధర 37 పైసలు పెరిగి రూ. 101.37కి చేరింది.
ఏపీ, తెలంగాణ ప్రధాన నగరాల్లో...
తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి.
- హైదరాబాద్‌లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర 36 పైసలు అధికమైంది. ప్రస్తుతం లీటరు ధర రూ. 108.96కు చేరింది. 38 పైసలు పెరిగిన లీటరు డీజిల్ ధర రూ. 102కి పెరిగింది.
- వైజాగ్‌లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర 35 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటరు ధర రూ.109.81గా ఉంది. డీజిల్ ధర 37 పైసలు అధికమై.. రూ.102.3కు చేరుకుంది.
- గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర 35 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 37 పైసలు అధికమైంది. నగరంలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 111.08, డీజిల్ ధర రూ.103.53కు చేరుకుంది.
ఇవీ చూడండి: