అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 533 పాయింట్ల బలపడి 42,426 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 12,423 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
ఒకానొక దశలో 650 పాయింట్లు పైకెగిసిన సెన్సెక్స్.. ప్రారంభ సెషన్లో రికార్డు లాభాలను నమోదు చేసింది.
భారీగా విదేశీ నిధుల ప్రవాహం మార్కెట్లను పరుగులు పెట్టించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయంతో ఆసియా మార్కెట్లు పుంజుకోవటం దేశీయ సూచీలకు కలిసివచ్చింది.
లాభనష్టాల్లో..
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ షేర్లు 3 శాతం మేర లాభాల్లో ఉన్నాయి.
ఐటీసీ, టీసీఎస్, మారుతి, ఎస్బీఐ స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర 2.66 శాతం పెరిగి బ్యారెల్‌కు 40.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది.