స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 350 పాయింట్లు కోల్పోయి 49,505 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 80 పాయింట్లకు పైగా నష్టంతో 14,660 వద్ద కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వైరస్ కట్టడి కోసం విధించిన ఆంక్షలతో ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో వాణిజ్య కార్యకలాపాలకు ఆటకం నెలకొనడం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు వెనకడుగు వేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
లాభనష్టాల్లో..
డా.రెడ్డీస్, సన్‌ఫార్మా, టెక్ మహేంద్ర, హిందుస్థాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, మారుతి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.