ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు కుదేలు..
స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1115 పాయింట్లు (దాదాపు 3 శాతం) తగ్గి 36,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 326 (దాదాపు 3 శాతం) పాయింట్ల నష్టంతో 10,805 వద్దకు చేరింది.
అన్ని రంగాలు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
- 30 షేర్ల ఇండెక్స్‌లో హెచ్‌యూఎల్ మత్రమే స్వల్పంగా లాభాన్ని గడించింది. మిగత అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
- ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది. బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎం&ఎం, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టాలను నమోదు చేశాయి.