41 వేల మార్కు దాటిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 506 పాయింట్ల బలపడి 41,123కు పెరిగింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 147 పాయింట్ల పైకెగిసి 12,055 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ సానుకూల పవనాలతో పాటు రిలయన్స్, ఇన్పోసిస్, ఎస్బీఐ వంటి హెవీ వెయిట్ షేర్లు రాణించటం మార్కెట్లకు కలిసివచ్చింది. సెప్టెంబర్ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకు మించి రాణించిన ఎస్బీఐ.. బీఎస్ఈలో 5 శాతం మేర లాభంతో దూసుకుపోతోంది.
లాభనష్టాల్లో...
ఎస్బీఐ, హెచ్‌సీఎల్‌టెక్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, టాటాస్టీల్ లాభాల్లో ఉన్నాయి.
టైటాన్, ఓఎన్జీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు..
షాంఘై, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి.
చమురు..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 1.29 శాతం తగ్గి బ్యారెల్‌కు 40.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.