బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.333 పెరిగి.. రూ.47,833 వద్దకు చేరింది.
వెండి ధర ఏకంగా రూ.2,021 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.73,122 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర మూడు నెలల గరిష్ఠస్థాయి అయిన 1,869 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్సుకు 28.48 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది.
ఇవీ చదవండి: మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్ 600 ప్లస్