బంగారం ధర నూతన గరిష్ఠానికి చేరుకుంది. అమెరికా, చైనా మధ్య తాజా వాణిజ్య యుద్ధ భయాలతో మదుపరులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడం కారణంగా బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి పసిడి ధర రూ. 1113 పెరిగి... రూ. 37, 920 వద్ద స్థిరపడింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల ముద్రణ సంస్థల నుంచి కొనుగోళ్లు పెరిగిన కారణంగా వెండి ధర కిలోకు రూ. 650 ఎగబాకి... రూ. 43, 670కి చేరింది.
స్థానికంగా ఉన్న డిమాండ్‌తో పాటు అంతర్జాతీయంగా ప్రీమియం లోహాల ధర పైకి ఎగబాకడం ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'ప్రజల మంత్రి'కి ప్రముఖుల ఘన నివాళి